ప్రశ్నోత్తరాలు

Does the Bible Prohibit Interracial Marriages?


ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులను జాత్యంతర వివాహం చేసుకోవద్దని ఆజ్ఞాపించింది (ద్వితీయో 7:3-4). అయితే, అలా ఆజ్ఞాపించడానికి చర్మం రంగో లేదా జాతో కారణం కాదు. అలా ఆజ్ఞాపించడం వెనుక ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. అన్య జాతుల ప్రజలు విగ్రహారాధకులవ్వడమే అలా ధర్మశాస్త్రం ఆజ్ఞాపించడం వెనకున్న ప్రధాన కారణం. ఇశ్రాయేలీయులు ఒకవేళ విగ్రహారాధకులైన అన్యజనులను వివాహం చేసుకుంటే వారు దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. ఇశ్రాయేలు ప్రజల విషయంలో సరిగ్గా ఇదే జరిగినట్లు మలాకీ 2:11లో చదువుతాము.

 వివాహం విషయంలో ఇటువంటి నియమాన్నే కొత్త నిబంధన కూడా బోధిస్తుంది. కానీ ఈ నియమం జాతికి సంబంధించింది కాదు: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?” (2 కొరింథీ 6:14-15). ఇశ్రాయేలీయులు (ఏకైక నిజ దేవుణ్ణి మాత్రమే నమ్మేవారు) విగ్రహారాధకులను వివాహం చేసుకోవద్దని ఆజ్ఞాపించిబడినట్లే, క్రైస్తవులు (ఏకైక నిజ దేవుణ్ణి మాత్రమే నమ్మేవారు) అవిశ్వాసులను వివాహం చేసుకోవద్దని ఆజ్ఞాపించబడ్డారు. జాత్యంతర వివాహం గానీ కులాంతర వివాహం గానీ తప్పని బైబిల్ ఎప్పుడూ చెప్పలేదు. బైబిల్ నిషేధించనిదానిని నిషేధించే అధికారం ఎవ్వరికీ లేదు.

జాతిభేదాలను బట్టి పక్షపాతంతో వ్యవహరించడం క్రైస్తవుల లక్షణం కాదు (యాకోబు 2:1-10). బైబిల్ ప్రకారం ఒకే ఒక్క జాతి ఉంది - అదే మానవజాతి. ఎందుకంటే మనుషులందరూ ఆదాము హవ్వల సంతానమే కదా. కాబట్టి ఒక విశ్వాసి తన జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ఆమె/అతను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా తిరిగి జన్మించారా లేదా అన్నది మొదట నిర్ధారించుకోవాలి (యోహాను 3:3-5). జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో రంగు, రూపం, అందచందాలు, కట్నం, సంపాదన, కులం, మతం, జాతి ఇవేవీ వాక్యం బోధించే ప్రమాణాలు కావు. క్రీస్తునందున్నవారా కాదా అన్నది మాత్రమే వాక్య ప్రమాణమై ఉంది. ఇక జాత్యంతర వివాహం చేసుకోవాలా వద్దా అన్న విషయానికొస్తే ఇది తప్పొప్పుల సమస్య కాదు. ఇది కేవలం ఎవరికివారు ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాల్సిన వ్యక్తిగత నిర్ణయం.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.