
సత్యమునుబట్టియు న్యాయమును బట్టియు నీతినిబట్టియు యెహోవా జీవముతోడని ప్రమా ణముచేసినయెడల జనములు ఆయనయందు తమకు ఆశీర్వా దము కలుగుననుకొందురు, ఆయనయందే అతిశయపడుదురు.
దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.(సెలా.)
నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొని పోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు.
యెహోవాయందే ఇశ్రాయేలు సంతతివారందరు నీతిమంతులుగా ఎంచబడినవారై యతిశయపడుదురు.
అంతే కాదు; మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొందియున్నాము.
అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.
అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను.
అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక; దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడి
ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము.
ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.
నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను
సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగింపబడియున్నది; కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రి ఎవడో, కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలు పరచనుద్దేశించునో వాడును తప్ప, మరెవడును ఎరుగడని చెప్పెను.
అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.
గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించుకొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.
మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్య వంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.
మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.
అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు–యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.
ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను.
యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది.
నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే
దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.
దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము
నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు
యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు.
బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును.
యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు యెహోవా క్రుంగినవారిని లేవనెత్తువాడు యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు
యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును.
పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని
క్రీస్తుయేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.
అందుకు సమూయేలు -తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.
యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచియున్నావు యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు.
ఏలయనగా న్యాయముచేయుట యెహోవానగు నా కిష్టము ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము. సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును.
మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.
తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతోసముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోప ముంచడు.