కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.
అందుకు అబ్రాహాము ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను.
నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దానుదాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.
జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పనివలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని; యెహోవా, కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా
తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణాపేక్షగలవాడై యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను.
నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనైయున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది.
యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవైయున్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము; మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులముకామని ప్రార్థనచేసితిని.
మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే; నీవు సత్యముగానే ప్రవర్తించితివి కాని మేము దుర్మార్గులమైతివిు.
నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.
నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.
నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.
మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.
మేమైతే నీ దాసులగు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజుల కును మా యధిపతులకును మా పితరులకును యూదయదేశ జను లకందరి కిని చెప్పిన మాటలను ఆలకిం పక
ప్రభువా , నీవే నీతిమంతుడవు ; మేమైతే సిగ్గుచేత ముఖ వికారమొందినవారము ; మేము నీమీద తిరుగుబాటు చేసితివిు; దానినిబట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి , యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు, పరదేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయు లందరికిని మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది.
సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను.
నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి --తండ్రీ , నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని ;
ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను ; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని , లేచి తండ్రియొద్దకు వచ్చెను .
అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.
పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను
నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వంతవస్త్రములకై అసహ్యుడనగుదును.
ఆయన నావలె నరుడు కాడు నేను ఆయనతో వ్యాజ్యెమాడజాలను మేము కలిసి న్యాయవిమర్శకు పోలేము.
మా యిద్దరిమీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు.
ఆయన తన దండమును నామీదనుండి తీసివేయవలెను నేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనుపరచకుండవలెను.
అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను, ఏలయనగా నేను అట్టివాడను కాననుకొనుచున్నాను.
నరపుత్రునివిషయమై వాని స్నేహితునితో వ్యాజ్యెమాడవలెననియు కోరి నేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను.
ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను.
ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలిసికొందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును.
ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా?ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును
అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడవచ్చును.కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతివలన శిక్షనొందకపోవుదును.
నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను, రాజువలె నేనాయనయొద్దకు వెళ్లెదను.
నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి నోటిమీద చేయి వేసికొనుడి.
అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యివేసికొనిరి.
వారునీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతోకూడ వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము, ఒకని యింటివారికే యాజకుడవై యుండుట నీకు మంచిదా, ఇశ్రాయేలీయులలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడవైయుండుట మంచిదా? అని యడిగిరి.
దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని.
నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి యుండినయెడల కీడు యోచించి యుండినయెడల నీ చేతితో నోరు మూసికొనుము.
అన్యజనులు అది చూచి తమకు కలిగిన బల మంత కొంచెమని సిగ్గుపడి నోరు మూసి కొందురు . వారి చెవులు చెవుడెక్కిపోవును .
అయితే యెహోవా తన పరిశు ద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక .
సకలజనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై యుండుడి.