
ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరీయులమీదికి క్షయరోగము పంపును వారిక్రింద అగ్నిజ్వాలలుగల కొరవికట్టె రాజును.
ఇశ్రాయేలుయొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును; అది అష్షూరుయొక్క బలురక్కసిచెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్కదినమున వాటిని మింగివేయును.
మరియు యాకోబు సంతతివారు అగ్నియు, యోసేపు సంతతివారు మంటయు అగుదురు; ఏశావు సంతతివారు వారికి కొయ్యకాలుగా ఉందురు; ఏశావు సంతతివారిలో ఎవడును తప్పించుకొనకుండ యోసేపు సంతతివారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట యిచ్చియున్నాడు.
వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములోనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.
సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు , వడిసెలరాళ్లను అణగద్రొక్కుచు త్రాగుచు , ద్రాక్షారసము త్రాగువారి వలె బొబ్బలిడుచు , బలిపశురక్త పాత్రలును బలిపీఠపు మూలలును నిండునట్లు రక్తముతో నిండియుందురు .
వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రములున్నవి.
అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును
గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును
విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకును వారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత యిదే యెహోవాను స్తుతించుడి.
కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయుదువు కొండలను పొట్టువలె చేయుదువు
నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొని పోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును . నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు .
మరియు చేతిసహాయము లేక తీయబడిన ఒక రాయి , యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదము లమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను .
అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరక కుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను ; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వ భూత లమంత మహా పర్వత మాయెను .
ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును . దాని కెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు ; అది ముందు చెప్పిన రాజ్యము లన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును .
చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే ; యిందువలన మహా దేవుడు ముందు జరుగబోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు ; కల నిశ్చయము , దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను.
సీయోను కుమారీ , నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను , లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగ ద్రొక్కుదువు , వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును , వారి ఆస్తిని సర్వ లోక నాధునికి ప్రతిష్టించుదును.
ఆయన సమాధానమునకు కారకుడగును , అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని నెదిరించుటకు మేము ఏడుగురు గొఱ్ఱలకాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము .
వారు అష్షూరు దేశమును , దాని గుమ్మములవరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు, అష్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన యీలాగున మనలను రక్షించును .
యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచువలెను , మనుష్య ప్రయత్నము లేకుండను నరుల యోచన లేకుండను గడ్డి మీద పడు వర్షమువలెను ఆయా జనముల మధ్యను నుందురు .
యాకోబు సంతతిలో శేషించినవారు అన్యజనులమధ్యను అనేక జనముల లోను అడవి మృగములలో సింహమువలెను , ఎవడును విడిపింప కుండ లోపలికి చొచ్చి గొఱ్ఱల మందలను త్రొక్కి చీల్చు కొదమసింహమువలెను ఉందురు.
మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.
అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనినవారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.
కుడిప్రక్కన ఉన్నదాని పట్టుకొందురు గాని ఇంకను ఆకలిగొని యుందురు; ఎడమప్రక్కన ఉన్నదాని భక్షించుదురు గాని ఇంకను తృప్తిపొందక యుందురు వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును
కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును.
సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,
కాబట్టి యెహోవా సెలవిచ్చునదేమనగా-వాత్సల్యముగలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్టబడును; యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగలాగుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
రెండవ దూతపరుగెత్తిపోయి యెరూషలేము లో మనుష్యులును పశువులును విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యౌవనుని కి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను.
మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.
యెహోవా సెలవిచ్చునదేమనగా నేను సీయోను నొద్దకు మరల వచ్చి, యెరూషలేములో నివాసముచేతును , సత్యమును అనుసరించు పురమనియు , సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును .
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపట్టుకొని , వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధలలో కూర్చుందురు .
ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడు పిల్లలతోను నిండియుండును .
యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మమువరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును ,హనన్యేలు గుమ్మము నుండి రాజు గానుగుల వరకును వ్యాపించును , మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోనువరకు దేశ మంతయు మైదానముగా ఉండును ,
పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు , శాపము ఇకను కలు గదు , యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు .
జనుల అధికారులు యెరూషలేములో నివాసముచేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధపట్టణమగు యెరూషలేమునందు పదిమందిలో ఒకడు నివసించునట్లును, మిగిలిన తొమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసిరి.
యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనినవారిని జనులు దీవించిరి.
యెరూషలేములో నివాసముచేసిన రాజ్యపు ప్రధానులు వీరే, యూదాపట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును నెతీనీయులును సొలొమోనుయొక్క దాసుల వంశస్థులును నివాసముచేసిరి.
మరియు యెరూషలేములో యూదులలో కొందరును బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా, జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, యితడు షెఫట్యకు పుట్టిన అమర్యా కుమారుడు, వీడు షెఫట్యకు పుట్టిన పెరెసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు.
మరియు షిలోనికి పుట్టిన జెకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజెకు పుట్టిన బారూకు కుమారుడైన మయశేయా నివసించెను.
యెరూషలేములో నివాసముచేసిన పెరెసు వంశస్థులందరును బలవంతులైన నాలుగువందల అరువది ఎనమండుగురు.
బెన్యామీనీయులలో ఎవరనగా యోవేదు పెదాయా కోలాయా మయశేయా ఈతీయేలు యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు.
అతని తరువాత గబ్బయి సల్లయి; వీరందరును తొమి్మదివందల ఇరువది యెనమండుగురు;
జిఖ్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూదా పట్టణముమీద రెండవ అధికారియైయుండెను.
యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యెదాయాయు యాకీనును
శెరాయా దేవుని మందిరమునకు అధిపతియైయుండెను. ఇతడు మషుల్లాము సాదోకు మెరాయోతు అహీటూబులను పితరుల వరుసలో హిల్కీయాకు పుట్టెను.
ఇంటిపని చేసినవారి సహోదరులు ఎనిమిదివందల ఇరువది యిద్దరు. మరియు పితరులైన మల్కీయా పషూరు జెకర్యా అవీ్జు పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయా.
పెద్దలలో ప్రధానులైన ఆ అదాయా బంధువులు రెండువందల నలువది యిద్దరు. మరియు ఇమ్మేరు మెషిల్లేమోతె అహజైయను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమష్షయి.
బలవంతులైనవారి బంధువులు నూట ఇరువది యెనమండుగురు. వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను; ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు.
లేవీయులలో ఎవరనగా, షెమయా. ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యా కనిన అజ్రీకాము కుమారుడైన హష్షూబునకు పుట్టినవాడు.
లేవీయులలో ప్రధానులైనవారిలో షబ్బెతైయును యోజాబాదును దేవుని మందిర బాహ్యవిషయములో పై విచారణచేయు అధికారము పొందిరి.
ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు; తన సహోదరులలో బక్బుక్యాయును యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతని చేతిక్రింది వారు
పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీయులందరు రెండువందల ఎనుబది నలుగురు.
ద్వారపాలకులైన అక్కూబు టల్మోను గుమ్మములు కాయువారును నూట డెబ్బది యిద్దరు.
ఇశ్రాయేలీయులలో శేషించిన యాజకులు లేవీయులు మొదలైనవారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి.
నెతీనీయులు ఓపెలులో నివసించిరి. జీహాయు గిష్పాయును నెతీనీయులకు ప్రధానులు.
యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు; ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరముయొక్క పనిమీద అధికారులు
వారిని గూర్చిన విధియేదనగా, గాయకులు వంతులప్రకారము ఒప్పందముమీద తమ పనిచేయవలెను, లేవీయులు రాజుయొక్క ఆజ్ఞనుబట్టి దినక్రమేణ జరుగు పనులు చూడవలెను.
మరియు యూదాదేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజబెయేలు కుమారుడగు పెతహయా జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను.
వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను యెకబ్సెయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను
యేషూవలోను మెలాదాలోను బేత్పెలెతులోను.
హజర్షువలులోను బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను
సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను
ఏన్రిమ్మోనులోను జొర్యాలోను యర్మూతులోను
జానోహలోను అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించినవారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయవరకు వారు నివసించిరి.
గెబనివాసులగు బెన్యామీనీయులు మిక్మషులోను హాయిలోను బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను
అనాతోతులోను నోబులోను అనన్యాలోను
హాసోరులోను రామాలోను గిత్తయీములోను
హాదీదులోను జెబోయిములోను నెబల్లాటులోను
లోదులోను పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి.
మరియు లేవీయుల సంబంధమైనవారిలో యూదా వంశస్థులలోనివారు బెన్యామీనీయులమధ్య భాగములు పొందిరి.
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుయాకోబు నివాసస్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలోనుండి రప్పింతును; అప్పుడు పట్టణము దాని కొండమీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును.
యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడురాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మమువరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును.
కొలనూలు దాని కెదురుగా గారేబుకొండవరకు పోవుచు గోయావరకు తిరిగి సాగును.
శవములును బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగువరకును గుఱ్ఱముల గవినివరకును తూర్పుదిశనున్న పొలములన్నియు యెహోవాకు ప్రతి ష్ఠితములగును. అది మరి ఎన్నడును పెల్లగింపబడదు, పడద్రోయబడదు.
పట్టణస్థాన వైశాల్యత ఎంతనగా, ఉత్తరమున నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము.
ఇశ్రాయేలీయుల గోత్రపు పేళ్లనుబట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలెను. ఉత్తరపుతట్టున రూబేనుదనియు, యూదాదనియు, లేవిదనియు మూడు గుమ్మములుండవలెను.
తూర్పుతట్టు నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆ తట్టున యోసేపుదనియు బెన్యామీనుదనియు దానుదనియు మూడు గుమ్మములుండవలెను.
దక్షిణపుతట్టు నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆ తట్టున షిమ్యోనుదనియు ఇశ్శాఖారుదనియు జెబూలూనుదనియు మూడు గుమ్మములుండవలెను.
పడమటితట్టు నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణముగలది. ఆ తట్టున గాదుదనియు ఆషేరుదనియు నఫ్తాలిదనియు మూడు గుమ్మములుండవలెను.
దాని కైవారము పదునెనిమిదివేల కొలకఱ్ఱల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాటనుండి ఆ పట్టణమునకు పేరు.