
ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలియొకటి సిద్ధపరచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు, యెహోవా సన్ని ధిని మౌనముగా నుండుడి.
అయ్యో, యెంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు; అది యాకోబు సంతతివారికి ఆపదతెచ్చుదినము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు.
యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినము.
సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశ నివాసు లందరు వణకు దురుగాక .
యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు?
యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడురక్తవర్ణమగును.
యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.
ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.
మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగుచేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు.
అంతము వచ్చుచున్నది , అంతమే వచ్చుచున్నది , అది నీ కొరకు కనిపెట్టుచున్నది , ఇదిగో సమీపమాయెను .
దేశ నివాసులారా , మీమీదికి దుర్ది నము వచ్చుచున్నది , సమయము వచ్చుచున్నది , దినము సమీపమాయెను , ఉత్సాహ ధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతములమీద వినబడు చున్నది.
కాలము వచ్చుచున్నది , దినము సమీపమాయెను , వారి సమూహ మంతటి మీద ఉగ్రత నిలిచి యున్నది గనుక కొనువారికి సంతోషముండ పనిలేదు , అమ్మువానికి దుఃఖముండ పనిలేదు .
కావున నీవు వారికి ఈ మాట తెలియజేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇకమీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలుకకుండ నేను దానిని నిరర్థకము చేసెదను గనుక నీవు వారితో ఇట్లనుము దినములు వచ్చుచున్నవి, ప్రతిదర్శనము నెరవేరును
మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి . ప్రభువు సమీపముగా ఉన్నాడు .
సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.
వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.
ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదనశబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగ లార్పును వినబడును, కొండల దిక్కునుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు.
నేను సంతాపము కలిగి యేడ్చుచున్నాను నాకు విముఖులై యుండుడి నా జనమునకు కలిగిన నాశనమునుగూర్చి నన్ను ఓదార్చుటకు తీవరపడకుడి.
దర్శనపు లోయలో సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా అల్లరిదినమొకటి నియమించియున్నాడు ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగజేయును ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును.
ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది దేవాలయమునుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతికారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది.
ఆలకించుడి, మంద కాపరుల మొఱ్ఱ వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోలవినబడుచున్నది, యెహోవా వారి మేతభూమినిపాడు చేసియున్నాడు.
యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు?
యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు ; యెరూషలేము లోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు ; భూమ్యా కాశములు వణకుచున్నవి . అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును , ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.
ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.
అప్పుడాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు నేనింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశమును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు.
హెష్బోనును ఏలాలేయును మొఱ్ఱపెట్టుచున్నవి యాహసువరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబీయుల యోధులు కేకలువేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణకుచున్నది.
వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు.
కోటలు పడగొట్టబడియున్నవి దుర్గములు పట్టబడియున్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.
భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను
బండల సందులలోను దాగుకొని -సింహాసనాసీనుడైయున్నవానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?
మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగుచేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు.