నాకు తెలిసేయున్నవి
యెషయా 37:28

నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.

ద్వితీయోపదేశకాండమ 31:21

విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారియెదుట సాక్షిగానుండి సాక్ష్యము పలుకును. అది మరువబడక వారి సంతతివారి నోట నుండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునుపే, నేడే వారు చేయు ఆలోచన నేనెరుగుదును అనెను.

ఆమోసు 5:12

మీ అపరాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపుర ముండరు, శృంగారమైన ద్రాక్షతోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రా గరు.

యోహాను 5:42

నేను మిమ్మును ఎరుగుదును; దేవుని ప్రేమ మీలో లేదు.

ప్రకటన 2:2

నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొనువారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు,

ప్రకటన 2:9

నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపువారివలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము.

ప్రకటన 2:13

సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయను వాడు మీమధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును.

వారి తలంపులు
యోబు గ్రంథము 42:2

నీవు సమస్తక్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని.

యెహెజ్కేలు 38:10

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ కాలమందు నీ మనస్సు లో అభిప్రాయములు పుట్టును,

మత్తయి 9:4

యేసు వారి తలంపులు గ్రహించి–మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు?

మత్తయి 12:25

ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను–తనకుతానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు.

లూకా 5:22

యేసు వారి ఆలోచన లెరిగి–మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు?

1 కొరింథీయులకు 3:20

మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.

హెబ్రీయులకు 4:12

ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.

సమకూర్చెదను
యెషయా 2:2

అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

కీర్తనల గ్రంథము 67:2

దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక.(సెలా.)

కీర్తనల గ్రంథము 72:11

రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరు అతని సేవించెదరు.

కీర్తనల గ్రంథము 72:17

అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండును అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు.

కీర్తనల గ్రంథము 82:8

దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరు నీకే స్వాస్థ్యముగా ఉందురు.

కీర్తనల గ్రంథము 86:9

ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు.

యోవేలు 3:2

అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆ యా దేశముల లోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యెమాడుదును.

రోమీయులకు 15:8-12
8

నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకు డాయెను.

9
అందు విషయమై ఈ హేతువుచేతను అన్యజను లలో నేను నిన్ను స్తుతింతును; నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది.
10
మరియు అన్యజనులారా, ఆయన ప్రజ లతో సంతోషించుడి అనియు
11
మరియు సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది.
12
మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.
రోమీయులకు 16:26

యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును

ప్రకటన 11:15

ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు -ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.

చూచెదరు
యెషయా 66:10

యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. ఆమెనుబట్టి దుఃఖించువారలారా, మీరందరు ఆమెతో ఉత్సహించుడి

యెహెజ్కేలు 39:21

నా ఘనతను అన్యజనులలో అగుపరచెదను, నేను చేసిన తీర్పును వారిమీద నేను వేసిన నా హస్తమును అన్యజనులందరు చూచెదరు.

యోహాను 17:24

తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలె ననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి.

2 కొరింథీయులకు 4:4-6
4

దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

5

–అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

6

గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించుకొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.