ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు
ఎఫెసీయులకు 4:25

మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.

జెకర్యా 8:16

మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను , సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను .

2 కొరింథీయులకు 4:2

అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము

2 కొరింథీయులకు 8:8

ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు; ఇతరుల జాగ్రత్తను మీకు చూపుటచేత మీ ప్రేమ యెంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను.

సత్యము చెప్పుచు
న్యాయాధిపతులు 16:15

అప్పుడు ఆమెనాయందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళిచేసి నీ గొప్పబలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను.

కీర్తనల గ్రంథము 32:2

యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.

యోహాను 1:47

యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచిఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను.

రోమీయులకు 12:9

మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.

యాకోబు 2:15

సహోదరు డైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేక యున్నప్పుడు.

యాకోబు 2:16

మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యకసమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?

1 పేతురు 1:22

మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.

1 యోహాను 3:18

చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.

ఎదుగుదము
ఎఫెసీయులకు 2:21

ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నది.

హొషేయ 14:5-7
5

చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును , తామరపుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు .

6

అతని కొమ్మలు విశాలముగా పెరుగును , ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును , లెబానోనుకున్నంత సువాసన అతనికుండును.

7

అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు . ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు . లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు .

మలాకీ 4:2

అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

1 పేతురు 2:2

సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,

2 పేతురు 3:18

మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్‌.

ఆయన
ఎఫెసీయులకు 1:22

మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.

ఎఫెసీయులకు 5:23

క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.

కొలొస్సయులకు 1:18

సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము , ఆయన ఆదియైయుండి మృతులలో నుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను .

కొలొస్సయులకు 1:19

ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ,