కాబట్టి నేను మీయొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక, మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారముచొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూరముగా ఉండగానే యీ సంగతులు వ్రాయుచున్నాను.
పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమునుగూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను.
మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలిసికొందురు.
మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందిన యెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్ను పంపలేదు.
అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.
అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను.
భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.
వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.
వారి చుట్టునున్న ఇశ్రాయేలీయులందరు వారి ఘోష విని భూమి మనలను మింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి.
మరియు యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.
అప్పుడు మీకాయా ఈలాగు చెప్పెను సకలజనులారా, నా మాట ఆలకించుడని చెప్పెను రాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నాచేత పలుకలేదు.
వెంటనే రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని యేబదిమందితో కూడ ఏలీయా యొద్దకు పంపెను . అతడు కొండ మీద కూర్బుని యుండగా అధిపతి యెక్కి అతని సమీపమునకు పోయి దైవ జనుడా , నీవు దిగిరావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను .
అందుకు ఏలీయా నేను దైవ జనుడ నైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా , అగ్ని ఆకాశము నుండి దిగి వానిని వాని యేబదిమందిని దహించెను .
మరల రాజు ఏబది మందిమీద అధిపతియైన మరియొకనిని వాని యేబదిమందితోకూడ పంపగా వీడువచ్చి దైవ జనుడా ,త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను .
అందుకు ఏలీయా నేను దైవ జనుడ నైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని చెప్పగా , ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వానిని వాని యేబదిమందిని దహించెను .
ఇంకను రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని ఏబదిమందితో కూడ పంపగా ఏబదిమంది మీద అధిపతియైన ఆ మూడవవాడు వచ్చి ఏలీయా యెదుట మోకాళ్లూని దైవ జనుడా , దయచేసి నా ప్రాణమును నీదాసులైన యీ యేబదిమంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము.
అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము , బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా
అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను . అప్పుడు రెండు ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చివేసెను .
అతడు అచ్చటనుండి పోయి కర్మెలు పర్వతమునకు వచ్చి అచ్చటనుండి పోయి షోమ్రోనునకు తిరిగివచ్చెను .
యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును.
అందుకు యేసువానిని ఆటంకపరచకుడి; నాపేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు;
నమి్మనవారివలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్య ములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడు దురు,
పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకర మైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.
ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను.
ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు
ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని
ఆయన యెరూషలే మునకు వెళ్ల నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు.
శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా,
ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.(కొన్ని ప్రాచీన ప్రతులలో-మీరు ఎట్టి ఆత్మగలవారో మీరెరుగరు మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకేగాని నశింపజేయుటకు రాలేదనెను-అని కూర్చబడియున్నది)
అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి.
వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.
ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి
రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచకక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.
భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.
అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను.?
అది నీయొద్దనున్నపుడు నీదే గదా? అమి్మన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమా
అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారికందరికిని మిగుల భయము కలిగెను;
అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి.
ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను.
అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమి్మతిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను.
అందుకు పేతురు ప్రభువుయొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతొ
వెంటనే ఆమె అతని పాదములయొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి.
సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను.
అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి.
కాబట్టి వీరు పరిశుద్ధాత్మచేత పంపబడినవారై సెలూకయకు వచ్చి అక్కడనుండి ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి.
వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై యుండెను.
వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్‌యేసు అను ఒక యూదుని చూచిరి.
ఇతడు వివేకముగలవాడైన సెర్గి పౌలు అను అధిపతియొద్దనుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను.
అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నముచేసి వారిని ఎదిరించెను; ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము.
అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై
అతని తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?
ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.
అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను.
మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను;
అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలిపోయెను.
అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పట్టినవారిమీద ప్రభువైన యేస
యూదుడైన స్కెవయను ఒక ప్రధానయాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి.
అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా
ఆ దయ్యముపట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి.
ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను.
ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును,
నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడివచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను.
వారిలో హుమెనైయును అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని.
ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై,
దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్యములచేతను,నానావిధములైన అద్భుతములచేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢపరచబడెను.