వీరంద రును
అపొస్తలుల కార్యములు 2:1

పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.

అపొస్తలుల కార్యములు 2:42

వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.

అపొస్తలుల కార్యములు 2:46

మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై

అపొస్తలుల కార్యములు 4:24-31
24

వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.

25

అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి?

26

ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదను భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి.

27

ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,

28

వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.

29

ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి

30

రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచకక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.

31

వారు ప్రార్థనచేయగానే వారు కూడియున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.

అపొస్తలుల కార్యములు 6:4

అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి.

మత్తయి 18:19

మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను.

మత్తయి 18:20

ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.

మత్తయి 21:22

మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమి్మనయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.

లూకా 11:13

పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధా త్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను .

లూకా 18:1

వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.

లూకా 24:53

యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.

ఎఫెసీయులకు 6:18

ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

వీరితోకూడ కొందరు స్త్రీలును
మత్తయి 27:55

యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి.

మార్కు 15:40

వారిలో మగ్దలేనే మరియయు, చిన్నయాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి.

మార్కు 16:1

విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.

లూకా 8:2

పండ్రెండుమంది శిష్యులును , అపవిత్రా త్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును , అనగా ఏడు దయ్యములు వదలి పోయిన మగ్దలేనే అనబడిన మరియయు , హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు , సూసన్నయు ఆయన తో కూడ ఉండిరి .

లూకా 8:3

​వీరును ఇతరు లనేకులును , తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము (అనేక ప్రాచీన ప్రతులలో-ఆయనకుపచారము అని పాఠాంతరము) చేయుచు వచ్చిరి.

లూకా 23:49

ఆయనకు నెళవైన వారందరును , గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి .

లూకా 23:55

అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి

లూకా 24:10

ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు యోహన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితో కూడ ఉన్న యితర స్త్రీలును.

యోహాను 19:25

ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి.

మరియయు
యోహాను 19:25

ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి.

యోహాను 19:26

యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా,యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను,

ఆయన సహోదరులును
మత్తయి 13:55

ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా?

మత్తయి 13:56

ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి.

మార్కు 3:31-35
31

ఆయన సహోదరులును తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి.

32

వారుఇదిగో నీ తల్లియు నీ సహోదరు లును వెలుపల ఉండి, నీకోసరము వెదకుచున్నారని ఆయ నతో చెప్పగా

33

ఆయననా తల్లి నా సహోదరులు ఎవరని

34

తన చుట్టుకూర్చున్న వారిని కలయచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులును;

35

దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహో దరియు తల్లియునని చెప్పెను.