
కాబట్టి యెహోవా సెలవిచ్చునదేమనగా --గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రిందనుండి తమ మెడలను తప్పించుకొన లేకుండునంతగాను , గర్వముగా నడువ లేకుండునంతగాను ఈ వంశమునకు కీడుచేయ నుద్దేశించుచున్నాను .
ఆ దినమున జనులు మిమ్మునుగురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా-మనము బొత్తిగా చెడిపోయి యున్నామనియు , ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యుల కిచ్చియున్నాడనియు , మనయొద్ద నుండకుండ ఆయన దానిని తీసివేసెసేయనియు ,మన భూములను తిరుగబడినవారికి ఆయన విభజించియున్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు.
ప్రవక్తలు అబద్ధప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు?
వారు మొఱ్ఱపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను యెహోవాకు వారు మొఱ్ఱపెట్టుదురు గాని ఆయనవారి కుత్తరమియ్యకుండును.
అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును.
ధర్మశాస్త్రము వినబడకుండ చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము.
మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.
వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి; అయినను ఆపత్కాలములోలేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు.
నీకు నీవు చేసికొనిన దేవతలు ఎక్కడ నున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించు నేమో; యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నియే గదా.
కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొఱ్ఱపెట్టినను నేను ఆలకింప కుందును.
కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా - నేను పిలిచినప్పుడు వారు ఆలకిం పకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకిం పను .
ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా , మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు
దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును.
కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయపడును.
కావున నా కోపము ఆ దినమున వారిమీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా యీ కీడులు మనకు ప్రాప్తించెననుకొందురు.
వారు అన్యదేవతలతట్టు తిరిగి చేసిన కీడంతటినిబట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును.
యెహోవా దానిని చూచెను. తన కూమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను.
ఆయన ఇట్లనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదను వారు మూర్ఖచిత్తముగలవారు విశ్వాసములేని పిల్లలు.
రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను
మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు .
మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది .
నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యె మాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు .
వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వల నేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విష సర్పము పుట్టును .
వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదు వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపదు వారి క్రియలు పాప క్రియలే వారు బలాత్కారము చేయువారే .
వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి
శాంత వర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమకొరకు వంకర త్రోవలు కల్పించుకొను చున్నారు వాటిలో నడచు వాడెవడును శాంతి నొందడు .
కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మును కలిసికొనుట లేదు వెలుగుకొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము
గోడ కొరకు గ్రుడ్డివారివలె తడవులాడుచున్నాము కన్నులు లేనివారివలె తడవులాడుచున్నాము సంధ్యచీకటియందువలెనే మధ్యాహ్నకాలమున కాలు జారి పడుచున్నాము బాగుగ బ్రతుకుచున్నవారిలోనుండియు చచ్చినవారివలె ఉన్నాము.
మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది
మేము చేసిన తిరుగుబాటుక్రియలు నీ యెదుట విస్తరించియున్నవి మా పాపములు మామీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటుక్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసేయున్నవి .
తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మావలన జరుగుచున్నవి.
న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సంతవీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింప నేరదు .
సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను .
కల్దీయులతో యుద్ధము చేసి, వారి చెడుతనమునుబట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపముచేత హతులై, తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తికలిగించుటకై వారు వచ్చుచుండగా
దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును.
అయితే భేదములు పుట్టించి , సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారిమీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.
దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు , మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ , శ్రమయు వేదనయు కలుగును.