అటు ఇటు పరుగెత్తుచు
2 దినవృత్తాంతములు 16:9

తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.

దానియేలు 12:4

దానియేలూ, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్య కాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలమంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను.

యోవేలు 2:9

పట్టణములో నఖముఖాల పరుగెత్తుచున్నవి గోడలమీద ఎక్కి యిండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలోగుండ జొరబడుచున్నవి.

ఆమోసు 8:12

కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రము వరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొర కదు;

జెకర్యా 2:4

రెండవ దూతపరుగెత్తిపోయి యెరూషలేము లో మనుష్యులును పశువులును విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యౌవనుని కి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను.

చూచి
సామెతలు 8:3

గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటనచేయుచున్నది

పరమగీతములు 3:2

నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు.

లూకా 14:21

అప్పుడా దాసుడు తిరిగి వచ్చి యీ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ యింటి యజమానుడు కోపపడి–నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి, బీదలను అంగహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొనిరమ్మని ఆ దాసునితో చెప్పెను.

న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ యత్నించుచున్న
1 రాజులు 19:10

అతడుఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యముల కధిపతియు దేవుడునగు యెహోవాకొరకు మహా రోషముగలవాడనై నేను ఒకడనుమాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడ తీసివేయుటకై చూచుచున్నారని మనవిచేసెను.

సామెతలు 20:6

దయచూపువానిని కలిసికొనుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును?

యెహెజ్కేలు 22:30

నేను దేశమును పాడుచేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడ లేదు.

మీకు కనబడినయెడల
ఆదికాండము 18:23-32
23

అప్పడు అబ్రాహాము సమీపించి యిట్లనెను–దుష్టులతోకూడ నీతిమంతులను నాశనము చేయుదువా?

24

ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండినయెడల దానిలోనున్న యేబదిమంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా?

25

ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు

26

యెహోవా–సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారినిబట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను

27

అందుకు అబ్రాహాము–ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను.

28

ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన–అక్కడ నలుబదియైదుగురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను;

29

అతడింక ఆయనతో మాటలాడుచు–ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన–ఆ నలుబదిమందిని బట్టి నాశనముచేయక యుందునని చెప్పగా

30

అతడు–ప్రభువు కోపపడనియెడల నేను మాటలాడెదను; ఒకవేళ అక్కడ ముప్పదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన–అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను.

31

అందుకతడు–ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన–ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయకుందుననగా

32

అతడు–ప్రభువు కోపపడనియెడల నేనింకొకమారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన–ఆ పదిమందినిబట్టి నాశనము చేయక యుందుననెను.

కీర్తనల గ్రంథము 12:1

యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండ గతించిపోయిరి.

కీర్తనల గ్రంథము 14:3

వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు

కీర్తనల గ్రంథము 53:2-4
2

వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను.

3

వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండ అందరును చెడియున్నారు మేలు చేయువారెవరును లేరు ఒక్కడైనను లేడు.

4

దేవునికి ప్రార్థనచేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా?

మీకా 7:1

వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్షపండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఏలాగుండునో నా స్థితి ఆలాగే యున్నది. ద్రాక్షపండ్ల గెల యొకటియు లేకపోయెను, నా ప్రాణమున కిష్టమైన యొక క్రొత్త అంజూరపుపండైనను లేకపోయెను.

మీకా 7:2

భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే; ప్రతిమనుష్యుడును కిరాతుడై తన సహోదరునికొరకు వలలను ఒగ్గును.

యత్నించుచున్న
సామెతలు 2:4-6
4

వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల

5

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.

6

యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.

సామెతలు 23:23

సత్యమును అమి్మవేయక దాని కొనియుంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచుకొనుము.

యెషయా 59:4

నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యె మాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు.

యెషయా 59:14

న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సంతవీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింప నేరదు.

యెషయా 59:15

సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను.

2 థెస్సలొనీకయులకు 2:10

దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును