that in me
ఆదికాండము 6:5

నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి

ఆదికాండము 8:21

అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి–ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము యికను సమస్త జీవులను సంహరింపను.

యోబు గ్రంథము 14:4

పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు?ఆలాగున ఎవడును పుట్టనేరడు.

యోబు గ్రంథము 15:14-16
14

శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?

15

ఆలోచించుము ఆయన తన దూతలయందు నమి్మకయుంచడు.ఆకాశవైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.

16

అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లుత్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా.

యోబు గ్రంథము 25:4

నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు?

కీర్తనల గ్రంథము 51:5

నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.

యెషయా 64:6

మేమందరము అపవిత్రులవంటివారమైతివిు మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతివిు గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను

మత్తయి 15:19

దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును

మార్కు 7:21-23
21

లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును

22

నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును.

23

ఈ చెడ్డవన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్ర పరచునని ఆయన చెప్పెను.

లూకా 11:13

పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.

ఎఫెసీయులకు 2:1-5
1

మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

2

మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.

3

వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.

4

అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసు

5

కృపచేత మీరు రక్షింపబడియున్నారు.

తీతుకు 3:3

ఎందుకనగా మనము కూడ;మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలముగడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని

1 పేతురు 4:2

శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొను నట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.

in my
రోమీయులకు 7:5

ఏలయనగా మనము శరీర సంబంధులమై యుండి నప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవము లలో కార్యసాధకములై యుండెను.

రోమీయులకు 7:25

మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై యున్నాను.

రోమీయులకు 8:3-13
3

శరీరము ననుసరింపక ఆత్మ ననుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాపపరిహారము నిమిత్తము

4

దేవుడు తన సొంత కుమారుని పాప శరీ రాకారముతో పంపి, ఆయన శరీర మందు పాపమునకు శిక్ష విధించెను.

5

శరీరా నుసారులు శరీర విషయములమీద మనస్సు నుంతురు; ఆత్మా నుసారులు ఆత్మ విషయములమీద మనస్సు నుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము;

6

ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.

7

ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు .

8

కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.

9

దేవుని ఆత్మ మీ లో నివసించియున్నయెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

10

క్రీస్తు మీ లోనున్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది.

11

మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీ లో నివసించిన యెడల, మృతు లలోనుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీ లో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును.

12

కాబట్టి సహోదరులారా, శరీరా నుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము.

13

మీరు శరీరా నుసారముగా ప్రవర్తించినయెడల చావ వలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన యెడల జీవించెదరు.

రోమీయులకు 13:14

మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి .

యోహాను 3:6

శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.

గలతీయులకు 5:19-21
19

శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20

విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు

21

భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టివాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

గలతీయులకు 5:24-21
for to will
రోమీయులకు 7:15

ఏలయనగా నేను చేయునది నేనెరుగను ; నేను చేయ నిచ్ఛయించు నది చేయక ద్వేషించు నదియే చేయుచున్నాను.

రోమీయులకు 7:19

నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను.

రోమీయులకు 7:25

మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై యున్నాను.

కీర్తనల గ్రంథము 119:5

ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడియుండిన నెంత మేలు.

కీర్తనల గ్రంథము 119:32

నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞలమార్గమున పరుగెత్తెదను.

కీర్తనల గ్రంథము 119:40

నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతినిబట్టి నన్ను బ్రదికింపుము.

కీర్తనల గ్రంథము 119:115-117
115

నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్‌క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి తొలగుడి.

116

నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశభంగమై నేను సిగ్గునొందకయుందును గాక.

117

నాకు రక్షణకలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను.

కీర్తనల గ్రంథము 119:173-117
కీర్తనల గ్రంథము 119:176-117
గలతీయులకు 5:17

శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

ఫిలిప్పీయులకు 2:13

ఎందుకనగా మీరు ఇచ్ఛయించుట కును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.

ఫిలిప్పీయులకు 3:12

ఇదివరకే నేను గెలిచితి ననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తు చున్నాను.