సంతోషించును
ద్వితీయోపదేశకాండమ 30:9

మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును.

యెషయా 62:5

యౌవనుడు కన్యకను వరించి పెండ్లిచేసికొనునట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లిచేసికొనెదరు పెండ్లికుమారుడు పెండ్లికూతురినిచూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును.

యిర్మీయా 32:41

వారికి మేలుచేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణహృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను.

మీకా 7:18

తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతోసముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోప ముంచడు.

జెఫన్యా 3:17

నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.

లూకా 15:6-10
6

మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొర్రె దొరకినదని వారితో చెప్పును గదా.

7

అటువలె మారుమనస్సు అక్కర లేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొకమందు ఎక్కువ సంతోషము కలుగును.

8

ఏ స్త్రీకైనను పది వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా?

9

అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరకినదని వారితో చెప్పును గదా.

10

అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల యెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాననెను.

లూకా 15:23-10
లూకా 15:24-10
లూకా 15:32-10
సంతో షించెనో
సామెతలు 1:26

కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను

యెషయా 1:24

కావున ప్రభువును ఇశ్రాయేలుయొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవాఈలాగున అనుకొనుచున్నాడు ఆహా, నా శత్రువులనుగూర్చి నేనికను ఆయాసపడను నా విరోధులమీద నేను పగ తీర్చుకొందును.

యెహెజ్కేలు 5:13

నా కోపము తీరును, వారిమీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును, నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొనుకాలమున యెహోవానైన నేను ఆసక్తిగలవాడనై ఆలాగు సెలవిచ్చితినని వారు తెలిసి కొందురు

యెహెజ్కేలు 33:11

కాగా వారితో ఇట్లనుము నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీ యులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతనుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

పెల్లగింపబడుదువు
ద్వితీయోపదేశకాండమ 7:22

నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు, అది నీకు క్షేమకరముకాదు.

యిర్మీయా 12:14

నేను నాజనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరచిన స్వాస్థ్యము నాక్రమించుకొను దుష్టులగు నా పొరుగు వారినిగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను వారి దేశములోనుండి వారిని పెల్లగింతును; మరియు వారి మధ్యనుండి యూదావారిని పెల్లగింతును.

యిర్మీయా 12:15

వారిని పెల్లగించిన తరువాత నేను మరల వారియెడల జాలిపడుదును; ఒక్కొకని తన స్వాస్థ్యమునకును ఒక్కొకని తన దేశమునకును వారిని రప్పింతును.

యిర్మీయా 18:7

దాని పెల్లగింతుననియు, విరుగగొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదోయొక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా

యిర్మీయా 24:6

వారికి మేలు కలుగునట్లు నేను వారిమీద దృష్టియుంచుచు, ఈ దేశమునకు వారిని మరల తీసికొనివచ్చి, పడగొట్టక వారిని కట్టెదను, పెల్లగింపక వారిని నాటెదను.

యిర్మీయా 31:28

వారిని పెల్లగించుటకును విరుగగొట్టుటకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేనేలాగు కనిపెట్టి యుంటినో ఆలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును; ఇదే యెహోవా వాక్కు.

యిర్మీయా 31:40

శవములును బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగువరకును గుఱ్ఱముల గవినివరకును తూర్పుదిశనున్న పొలములన్నియు యెహోవాకు ప్రతి ష్ఠితములగును. అది మరి ఎన్నడును పెల్లగింపబడదు, పడద్రోయబడదు.

యిర్మీయా 42:10

నేను మీకు చేసిన కీడునుగూర్చి సంతాపమొందియున్నాను, మీరు తొందరపడక యీ దేశములో కాపురమున్న యెడల, పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెల్లగింపక నాటెదను.

దానియేలు 7:8

నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటిమధ్యను లేచెను; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను.