మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టినప్పుడు యెహోవా మన మొఱ్ఱను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను.
నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?
ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొనుదాని ప్రకారము సమస్తము ననుగ్రహించుము, అప్పుడు లోకములోని జనులందరును నీ నామమును ఎరిగి, ఇశ్రాయేలీయులగు నీ జనులవలెనే నీయందు భయభక్తులు కలిగి, నేను కట్టించిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలిసికొందురు.
సకలజనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై యుండుడి.
కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక,
ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు
నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయుము యెరూషలేముయొక్క గోడలను కట్టించుము.
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు--చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదాదేశములోను దాని పట్టణములలోను జనులునీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు.
దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక
తనతోడు అని ప్రమాణముచేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను.
ఆ మాట నమి్మ అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను.
మనుష్యులు తమకంటె గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే.
ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై,తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి,
మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.