యెహోవా , నిన్నుగూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యెహోవా , సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము .
అన్యజనులలో జరుగునది చూడుడి , ఆలోచించుడి , కేవలము విస్మయమునొందుడి . మీ దినములలో నేనొక కార్యము జరిగింతును , ఆలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మ కయుందురు .
ఆలకించుడి , తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూ దిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపు చున్నాను .
వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు .
వారి గుఱ్ఱములు చిరుతపులుల కంటె వేగముగా పరుగులెత్తును , రాత్రియందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి ; వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు , ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు .
వెనుక చూడకుండ బలాత్కారము చేయుటకై వారు వత్తురు , ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెర పట్టు కొందురు .
రాజులను అపహాస్యము చేతురు , అధిపతులను హేళన చేతురు , ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు , మంటి దిబ్బవేసి వాటిని పట్టుకొందురు .
తమ బలమునే తమకు దేవతగా భావింతురు , గాలికొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవుచు అపరాధులగుదురు .
ప్రవక్తలను గూర్చినది. యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా యెముకలన్నియు కదలు చున్నవి, నేను మత్తిల్లినవానివలెను ద్రాక్షారసవశుడైన బలాఢ్యునివలెను ఉన్నాను.
ఆత్మ నన్నెత్తి తోడు కొనిపోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్నిచేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొనిపోయినప్పుడు , యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను .
ఈ దర్శనము కలుగగా దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్లు వ్యాధిగ్రస్తుడనైయుంటిని ; పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచువచ్చితిని . ఈ దర్శనమును గూర్చి విస్మయముగలవాడనైతిని గాని దాని సంగతి తెలుపగలవాడెవడును లేక పోయెను.
నేను ఒంటరినై యా గొప్ప దర్శనమును చూచితిని ; చూచినందున నాలో బల మేమియు లేకపోయెను , నా సొగసు వికార మాయెను , బలము నా యందు నిలువ లేదు .
అయ్యో నాకు శ్రమ; నా తల్లీ, జగడమాడువాని గాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేల నన్ను కంటివి? వడ్డికి నేను బదులియ్యలేదు, వారు నాకు బదులిచ్చినవారు కారు అయినను వారందరు నన్ను శపించు చున్నారు.
అందుకు యెహోవానిశ్చయముగా నీకు మేలుచేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను.
కటకటా, నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగుచేత అలసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను అని నీవనుకొనుచున్నావు.
నీవు అతనికి ఈ మాట తెలియజేయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడునేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినదానినే పెల్లగించుచున్నాను; సర్వభూమినిగూర్చియు ఈ మాట చెప్పుచున్నాను.
నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు; నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్లు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
యెహోవా యెరూషలేమను ఆ పట్టణము లో ప్రవేశించి చుట్టు తిరిగి , దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూల్గు లిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయుమని వారి కాజ్ఞాపించి
నేను వినుచుండగా వారికీలాగు సెలవిచ్చెను మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధస్థలము దగ్గర మొదలుపెట్టి , కటాక్షమైనను కనికరమైనను లేకుండ అందరిని హతము చేయుడి.
అందరు నశించునట్లు ఎవరిని విడిచిపెట్టక, పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని, ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్ట కూడదు . వారు మందిరము ముందరనున్న పెద్దలను హతముచేయ మొదలు పెట్టగా
ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,
దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు
మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.
ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరి యందు ప్రశంసింపబడుటకును,ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు
ఆలకించుడి , తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూ దిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపు చున్నాను .
యెహోవా దూరమైయున్న భూదిగంతమునుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును,
క్రూరముఖము కలిగి వృద్ధులను ¸యౌవనస్థులను కటాక్షింపని జనమును గద్ద యెగిరి వచ్చునట్లు నీమీదికి రప్పించును.
నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునే గాని పశువుల మందలనేగాని గొఱ్ఱ మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు.
మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను వారు నిన్ను ముట్టడివేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడివేయుదురు.
యెహోయాకీము దినములలో బబులోనురాజైన నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై మూడేండ్ల సేవ చేసిన తరువాత అతనిమీద తిరుగుబాటుచేయగా
యెహోవా అతనిమీదికిని, తన సేవకులైన ప్రవక్తలద్వారా తాను సెలవిచ్చిన మాటచొప్పున యూదాదేశమును నాశనముచేయుటకై దానిమీదికిని, కల్దీయుల సైన్యములను సిరియనుల సైన్యములను మోయాబీయుల సైన్యములను ఆమ్మోనీయుల సైన్యములను రప్పించెను.
ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.
సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండ కుండ చేసెదను.
ఈ దేశమంతయు పాడుగాను నిర్జనము గాను ఉండును; ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోనురాజునకు దాసులుగా ఉందురు.