దానియేలు
దానియేలు 4:8

కడపట బెల్తెషాజరను నా దేవత పేరునుబట్టి బిరుదుపొందిన దానియేలనువాడు నా యెదుటికి వచ్చెను; పరిశుద్ధ దేవతల ఆత్మ అతనియందుండెను, కావున నేనతనికి నా కలను చెప్పితిని.

దానియేలు 1:7

నపుంసకుల యధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేళ్లు పెట్టెను.

దానియేలు 2:26

రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా? అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా

దానియేలు 5:12

ఈ దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నల కుత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును.

విస్మయమునొంది
దానియేలు 4:9

ఎట్లనగా-శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరూ, పరిశుద్ధ దేవతల ఆత్మ నీయందున్నదనియు, ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నే నెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము.

దానియేలు 7:28

దానియేలను నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడనైతిని; అందుచేత నా ముఖము వికారమాయెను; అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకొంటిని.

దానియేలు 8:27

ఈ దర్శనము కలుగగా దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్లు వ్యాధిగ్రస్తుడనైయుంటిని; పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచువచ్చితిని. ఈ దర్శనమును గూర్చి విస్మయముగలవాడనైతిని గాని దాని సంగతి తెలుపగలవాడెవడును లేక పోయెను.

దానియేలు 10:16

అప్పుడు నర స్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నాయెదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని నా యేలినవాడా, యీ దర్శనమువలన నాకు వేదన కలిగి నందున నా బలము తొలగిపోయెను,

దానియేలు 10:17

నా యేలినవాని దాసుడనైన నేను నా యేలిన వానియెదుట ఏలాగున మాటలాడుదును? నా బలము తొలగి పోయెను, ఊపిరి విడువ లేక యున్నానని చెప్పగా

యిర్మీయా 4:19

నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నా కెంతో వేదనగానున్నది; నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను; నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా?

హబక్కూకు 3:10

నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పై కెత్తును.

let
దానియేలు 4:4

నెబుకద్నెజరను నేను నా యింట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనైయుండి యొక కల కంటిని; అది నాకు భయము కలుగజేసెను.

దానియేలు 4:5

నేను నా పడక మీద పరుండియుండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను.

1 సమూయేలు 3:17

ఏలీ-నీతో యెహోవా యేమి సెలవిచ్చెనో మరుగుచేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైన నీవు మరుగుచేసినయెడల అంతకంటె అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాకని చెప్పగా

నా యేలినవాడా
దానియేలు 4:24

రాజా, యీ దర్శనభావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా యేలినవాని గూర్చి చేసిన తీర్మాన మేదనగా

దానియేలు 10:16

అప్పుడు నర స్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నాయెదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని నా యేలినవాడా, యీ దర్శనమువలన నాకు వేదన కలిగి నందున నా బలము తొలగిపోయెను,

ఆదికాండము 31:35

ఆమె తన తండ్రితో–తమ యెదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు; నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెదకినను ఆ విగ్రహములు దొరకలేదు.

ఆదికాండము 32:4

–మీరు నా ప్రభువైన ఏశావుతో–ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించి యుంటిని;

ఆదికాండము 32:5

నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీజనమును కలరు; నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారి కాజ్ఞాపించెను.

ఆదికాండము 32:18

నీవు–ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావుకొరకు పంపబడిన కానుక; అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను.

నిర్గమకాండము 32:32

అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములోనుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాననెను.

1 సమూయేలు 1:15

హన్నా–అది కాదు, నా యేలినవాడా, నేను మనోధుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించు కొనుచున్నాను.

1 సమూయేలు 24:8

అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లి -నా యేలినవాడా రాజా, అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి

1 సమూయేలు 26:15

అందుకు దావీదు -నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీయులలో నీ వంటివాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీ వెందుకు కాపు కాయక పోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే;

2 సమూయేలు 18:31

అంతలో కూషీ వచ్చి –నా యేలినవాడా రాజా, నేను నీకు శుభసమాచారము తెచ్చితిని; యీ దినమున యెహోవా నీ మీదికి వచ్చినవారినందరిని ఓడించి నీకు న్యాయము తీర్చెనని చెప్పినప్పుడు

1 రాజులు 18:7

ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలీయా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా యితని నెరిగి నమస్కారము చేసి నా యేలినవాడవైన ఏలీయావు నీవే గదా యని అడుగగా

దర్శనము
2 సమూయేలు 18:32

రాజు –బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడిగెను. అందుకు కూషీ చెప్పినదేమనగా –నా యేలినవాడవును రాజవునగు నీ శత్రువులును నీకు హాని చేయవలెనని నీ మీదికి వచ్చిన వారందరును ఆ బాలుడున్నట్టుగానే యుందురు గాక.

యిర్మీయా 29:7

నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణముయొక్క క్షేమముకోరి దానికొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును.