a matter
నిర్గమకాండము 23:7

అబద్ధమునకు దూరముగానుండుము; నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు; నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను.

నిర్గమకాండము 24:14

అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి; ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు; ఎవనికైనను వ్యాజ్యెమున్నయెడల వారియొద్దకు వెళ్లవచ్చునని వారితో చెప్పెను.

ద్వితీయోపదేశకాండమ 17:8-12
8

హత్యకు హత్యకు వ్యాజ్యెమునకు వ్యాజ్యెమునకు దెబ్బకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యముకాని యెడల

9

నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్లి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు.

10

యెహోవా ఏర్పరచుకొను స్థలమున వారు నీకు తెలుపు తీర్పుచొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటిచొప్పున తీర్పుతీర్చుటకు జాగ్రత్తపడవలెను.

11

వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పుచొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాటనుండి కుడికిగాని యెడమకుగాని నీవు తిరుగకూడదు.

12

మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనేగాని ఆ న్యాయాధిపతి మాటనేగాని విననొల్లనియెడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీయులలోనుండి పరిహరింపవలెను.

2 సమూయేలు 15:3

అబ్షాలోము నీ వ్యాజ్యెము సరిగాను న్యాయముగాను ఉన్నదిగాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి

యోబు గ్రంథము 31:13

నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యెమాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యముచేసినయెడల

అపొస్తలుల కార్యములు 18:14

పౌలు నోరు తెరచి మాటలాడబోగా గల్లియోను యూదులారా, యిదియొక అన్యాయము గాని చెడ్డ నేరము గాని యైనయెడల నేను మీమాట సహనముగా వినుట న్యాయమే.

అపొస్తలుల కార్యములు 18:15

ఇది యేదోయుక ఉపదేశమును, పేళ్లను, మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి; ఈలాటి సంగతులనుగూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సులేదని యూదులతో చెప్పి

1 కొరింథీయులకు 6:1

మీలో ఒకనికి మరియొకనిమీద వ్యాజ్యెమున్నప్పుడు వాడు పరిశుద్ధులయెదుట గాక అనీతిమంతులయెదుట వ్యాజ్యెమాడుటకు తెగించుచున్నాడా?

one and another
నిర్గమకాండము 2:13

మరునాడు అతడు బయట నడిచి వెళ్లుచుండగా హెబ్రీయులైన మనుష్యులిద్దరు పోట్లాడుచుండిరి.

make
లేవీయకాండము 24:15

మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను.

సంఖ్యాకాండము 15:35

తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను.

సంఖ్యాకాండము 27:6-11
6

యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము.

7

నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను.

8

మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను ఒకడు కుమారుడు లేక మృతిబొందినయెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను.

9

వానికి కుమార్తె లేనియెడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను.

10

వానికి అన్నదమ్ములు లేని యెడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్న దమ్ములకు ఇయ్యవలెను.

11

వాని తండ్రికి అన్నదమ్ములు లేని యెడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను; వాడు దాని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ.

సంఖ్యాకాండము 36:6-9
6

యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టులైనవారిని పెండ్లి చేసికొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్రవంశములోనే పెండ్లి చేసికొనవలెను.

7

ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన పితరుల గోత్రస్వాస్థ్యమును హత్తుకొని యుండవలెను.

8

మరియు ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు, ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యముగల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రవంశములోనే పెండ్లిచేసికొనవలెను.

9

స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచియుండవలెను.

ద్వితీయోపదేశకాండమ 4:5

నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని.

ద్వితీయోపదేశకాండమ 5:1

మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి యిట్లనెను ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిననుసరించి నడువుడి.

ద్వితీయోపదేశకాండమ 6:1

నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును

1 సమూయేలు 12:23

నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక . కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును .

మత్తయి 28:20

నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.

1 థెస్సలొనీకయులకు 4:1

మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు.

1 థెస్సలొనీకయులకు 4:2

కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము.