If thou
లేవీయకాండము 26:3

మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినయెడల

లేవీయకాండము 26:13

మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములోనుండి మిమ్మును రప్పించితిని; నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని.

ద్వితీయోపదేశకాండమ 7:12

మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణముచేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును

ద్వితీయోపదేశకాండమ 7:13

ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధిచేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువులమందలను, నీ గొఱ్ఱల మందలను, మేకల మందలను దీవించును.

ద్వితీయోపదేశకాండమ 7:15

యెహోవా నీయొద్దనుండి సర్వరోగములను తొలగించి, నీవెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరచి, నిన్ను ద్వేషించు వారందరిమీదికే వాటిని పంపించును.

ద్వితీయోపదేశకాండమ 28:1-15
1

నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును.

2

నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును.

3

నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింపబడుదువు;

4

నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొఱ్ఱ మేకల మందలు దీవింపబడును;

5

నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును.

6

నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు.

7

నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హతమగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలుదేరివచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవుదురు.

8

నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నము లన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును.

9

నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్టితజనముగా నిన్ను స్థాపించును.

10

భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు.

11

మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును.

12

యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనములకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు

13

నేడు నేను మీకాజ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి

14

అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువుగాని క్రిందివాడవుగా ఉండవు.

15

నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.

and wilt
ద్వితీయోపదేశకాండమ 12:28

నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతివారికిని నిత్యము మేలుకలుగునట్లు నేను నీకాజ్ఞాపించుచున్న యీ మాటలన్నిటిని నీవు జాగ్రత్తగా వినవలెను.

ద్వితీయోపదేశకాండమ 13:18

నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్నినుండి మళ్లుకొని నీయందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణముచేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు, నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీయొద్ద ఉంచుకొనకూడదు.

1 రాజులు 11:33

అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును, నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇశ్రాయేలీయుల గోత్రములలోనుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును.

1 రాజులు 11:38

నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని, నా మార్గముల ననుసరించి నడచుచు, నా దృష్టికి అనుకూలమైనదానిని జరింగిచుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనినయెడల, నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు అప్పగించెదను.

2 రాజులు 22:2

అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు,కుడి యెడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను.

యెహెజ్కేలు 18:5

ఒకడు నీతి పరుడై నీతి న్యాయములను అనుసరించువాడైయుండి

diseases
నిర్గమకాండము 9:10

కాబట్టి వారు ఆవపుబుగ్గి తీసికొనివచ్చి ఫరో యెదుట నిలిచిరి. మోషే ఆకాశమువైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను.

నిర్గమకాండము 9:11

ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషేయెదుట నిలువలేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికిని పుట్టెను.

నిర్గమకాండము 12:29

అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీయొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలనందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను.

ద్వితీయోపదేశకాండమ 7:15

యెహోవా నీయొద్దనుండి సర్వరోగములను తొలగించి, నీవెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరచి, నిన్ను ద్వేషించు వారందరిమీదికే వాటిని పంపించును.

ద్వితీయోపదేశకాండమ 28:27

యెహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను కుష్టుచేతను గజ్జిచేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు.

ద్వితీయోపదేశకాండమ 28:60

నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదికి తెప్పించును; అవి నిన్ను వెంటాడును.

నేను
నిర్గమకాండము 23:25

నీ దేవుడైన యెహోవానే సేవింప వలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించె దను.

2 రాజులు 20:5

నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు.

యోబు గ్రంథము 5:18

ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును.

కీర్తనల గ్రంథము 41:3

రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.

కీర్తనల గ్రంథము 41:4

యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసియున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను.

కీర్తనల గ్రంథము 103:3

ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.

కీర్తనల గ్రంథము 147:3

గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు.

యెషయా 57:18

నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును.

యిర్మీయా 8:22

గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యు డును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవుచున్నది?

యిర్మీయా 33:6

నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించు చున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను.

హొషేయ 6:1

మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును

యాకోబు 5:11-16
11

సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.

12

నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశముతోడనిగాని భూమితోడనిగాని మరి దేని తోడనిగాని ఒట్టుపెట్టుకొనక, మీరు తీర్పుపాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను.

13

మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను.

14

మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను.

15

విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.

16

మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.