
స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పుపొందబోవువారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగు ననే ప్రవర్తించుడి.
అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.
అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసవ
కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచుకొనక నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.
మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.
నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.
రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను
ఆ శాస్త్రి–బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే.
పూర్ణ హృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణబలముతోను, ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను.
అతడు–నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను , నీ పూర్ణమనస్సుతోను , నీ పూర్ణ శక్తితోను , నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు , నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు , వ్రాయబడియున్నాదని చెప్పెను.
అందుకాయన–నీవు సరిగా ఉత్తరమిచ్చితివి ; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను .
అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి , అతడు–అవును గాని నా పొరుగువాడెవడని యేసునడిగెను .
అందుకు యేసు ఇట్లనెను–ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోపట్టణమునకు దిగి వెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను ; వారు అతని బట్టలు దోచుకొని , అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి
అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను . అతడు అతనిని చూచి , ప్రక్కగా పోయెను .
ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను .
అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు , అతడు పడియున్నచోటికి వచ్చి
అతనిని చూచి , అతనిమీద జాలిపడి , దగ్గరకుపోయి , నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి , తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరమర్శించెను
మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవానికిచ్చి–ఇతని పరామర్శించుము , నీవింకే మైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను .
కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు–అతని మీద జాలి పడినవాడే అనెను .
అందుకు యేసు–నీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను .
ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు . పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు .
ఏలాగనగా వ్యభిచరింప వద్దు , నరహత్య చేయవద్దు , దొంగిల వద్దు , ఆశింప వద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలె నను వాక్యము లో సంక్షేపముగా ఇమిడియున్నవి .
ధర్మశాస్త్రమంతయు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది.
ఒకని భారములనొకడు భరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.
సహోదరప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి.
దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగునమ్ముట మంచిదే; దయ్యములును నమి్మ వణకుచున్నవి.
యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగియున్నావు, ఆ తాత్పర్యము మంచిదే;
వారు మనము చేయునది మంచి పనికాదు, నేటిదినము శుభవర్తమానముగల దినము, మనము ఊరకొననేల? తెల్లవారువరకు మనము ఇచ్చట నుండిన యెడల ఏదైన నొక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని
అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? అని యడిగెను.
అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను.
అతని యజమానుడు–భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను.
అతని యజమానుడు–భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను.
అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచి పని .