being(గద్దింపబడినవారై)
ఆదికాండము 42:21

అప్పుడు వారు–నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి; అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.

ఆదికాండము 42:22

మరియు రూబేను–ఈ చిన్నవానియెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నదని వారికి ఉత్తరమిచ్చెను.

1 రాజులు 2:44

నీవు మా తండ్రియైన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియును. నీవు చేసిన కీడు యెహోవా నీ తలమీదికే రప్పించును.

1 రాజులు 17:18

ఆమె ఏలీయాతో దైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా

కీర్తనల గ్రంథము 50:21

ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను

ప్రసంగి 7:22

నీవును అనేకమారులు ఇతరులను శపించితివని నీకే తెలిసియున్నది గదా.

మార్కు 6:14-16
14

ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి విని–బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడు గనుక అతనియందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను.

15

ఇతరులు–ఈయన ఏలీయా అనియు, మరికొందరు–ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి.

16

అయితే హేరోదు విని–నేను తల గొట్టించిన యోహానే; అతడు మృతులలోనుండి లేచి యున్నాడని చెప్పెను.

లూకా 12:1-3
1

అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేలకొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను– పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి.

2

మరుగైనదేదియు బయలుపరచబడకపోదు ; రహస్యమైన దేదియు తెలియబడకపోదు .

3

అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనునవి వెలుగు లో వినబడును , మీరు గదులయందు చెవిలో చెప్పుకొనునది మిద్దెల మీద చాటింపబడును .

రోమీయులకు 2:15

అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను , వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయము లయందు వ్రాయబడి నట్టు చూపుచున్నారు .

రోమీయులకు 2:22

వ్యభిచరింప వద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా ? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా ?

1 యోహాను 3:20

ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము.

బయటికి వెళ్లిరి
యోబు గ్రంథము 5:12

వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండ ఆయన వారి ఉపాయములను భంగపరచును

యోబు గ్రంథము 5:13

జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలక్రిందుచేయును

యోబు గ్రంథము 20:5

ఆదినుండి నరులు భూమిమీదనుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?

యోబు గ్రంథము 20:27

ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారిమీదికి లేచును.

కీర్తనల గ్రంథము 9:15

తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది.

కీర్తనల గ్రంథము 9:16

యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాముచేసికొనిన దానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్‌ సెలా.)

కీర్తనల గ్రంథము 40:14

నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.

కీర్తనల గ్రంథము 71:13

నా ప్రాణవిరోధులు సిగ్గుపడి నశించుదురు గాక. నాకు కీడుచేయజూచువారు నిందపాలై మాన భంగము నొందుదురుగాక.

లూకా 13:17

ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరు సిగ్గుపడిరి; అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను.

ఒక్కడే
యోహాను 8:2

తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను.

యోహాను 8:10

యేసు తలయెత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు

యోహాను 8:12

మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.