అటువలె మారుమనస్సు అక్కర లేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొకమందు ఎక్కువ సంతోషము కలుగును .
ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను , తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోష పడసాగిరి .
వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూత తో కూడనుండి
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను .
పెండ్లికుమార్తెగలవాడు పెండ్లి కుమారుడు; అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును; ఈ నా సంతోషము పరిపూర్ణమై యున్నది.
నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.
అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను.
కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనీకే సమరయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి.
మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను.
మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనా నందించి మీ యందరితోకూడ సంతోషింతును.
కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా , నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా , యిట్లు ప్రభువు నందు స్థిరులై యుండుడి .
ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకీరీటమైనను ఏది? మన ప్రభువైన యేసుయొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా.
అందుచేత సహోదరులారా, మా యిబ్బంది అంతటి లోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితివిు.
ఏలయనగా, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టే.
మేము మీ ముఖముచూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా,
ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.
మీరు గొఱ్ఱలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు.