ఎమి
లూకా 12:22

అంతట ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఈ హేతువుచేత మీరు -- ఏమి తిందుమో , అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో , అని మీ దేహమును గూర్చియైనను చింతిం పకుడి

లూకా 12:29

ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి.

లూకా 10:25

ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకు డొకడు లేచి బోధకుడా , నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను .

లూకా 16:3

ఆ గృహనిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహనిర్వాహకత్వపు పనిలోనుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును ? త్రవ్వ లేను , భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను .

అపొస్తలుల కార్యములు 2:37

వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా

అపొస్తలుల కార్యములు 16:30

వారిని వెలుపలికి తీసికొనివచ్చి అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను.

నేనేమి చేతునని
లూకా 12:33

మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించు కొనుడి; అక్కడికి దొంగరాడు, చిమ్మెటకొట్టదు

లూకా 3:11

అతడు రెండు అంగీలుగలవాడు ఏమియు లేనివాని కియ్యవలెననియు, ఆహారముగలవాడును ఆలాగే చేయవలె ననియు వారితో చెప్పెను.

లూకా 11:41

కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి , అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును .

లూకా 14:13

అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము .

లూకా 14:14

నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడ వగుదువు ; నీతిమంతుల పునరుత్థాన మందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.

లూకా 16:9

అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి ; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసము లలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను

లూకా 18:22

యేసు విని నీకింక ఒకటి కొదువగా నున్నది; నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను.

లూకా 19:17

అతడు భళా , మంచి దాసుడా , నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను .

ప్రసంగి 11:2

ఏడుగురికిని ఎనమండు గురికిని భాగము పంచిపెట్టుము, భూమిమీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు.

యెషయా 58:7

నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

మత్తయి 5:42

నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు.

రోమీయులకు 12:13

పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు , శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి .

2 కొరింథీయులకు 9:6-15
6

కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.

7

సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.

8

మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.

9

ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది.

10

విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్యభాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొందించును.

11

ఇట్టి, ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.

12

ఏలయనగా ఈ సేవనుగూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది.

13

ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు.

14

మరియు మీయెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై యున్నారు.

15

చెప్పశక్యముకాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.

1 తిమోతికి 6:17

ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమి్మకయుంచక,సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమి్మకయుంచుడని ఆజ్ఞాపించుము.

1 యోహాను 3:16

ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.