ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను ; ఎఫ్రాయిము ఎవరును త్రిప్పి వేయని అప్పమువంటి వాడాయెను .
ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి,బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి.
వారు వివే చింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయ బడెను.
మిద్దెలమీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరునుబట్టియు, బయలు దేవత తమకు రాజనుదాని నామమును బట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను.
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.
ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింప లేడు ; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును , లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును ; మీరు దేవునిని సిరిని సేవింప లేరని చెప్పెను.
ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై,
అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.
గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు.
వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.
నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.
నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.
బేతావెనులోనున్న దూడవిషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు , దాని ప్రభావము పోయెనని ప్రజలును , సంతోషించుచుండిన దాని అర్చకులును దుఃఖింతురు .
ఎఫ్రాయిము అవమానము నొందుటకు , ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచనవలన సిగ్గు తెచ్చుకొనుటకు, అది అష్షూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును.
షోమ్రోను నాశమగును , దాని రాజు నీళ్లలో కొట్టుకొనిపోవు నురుగుతో సమానమగును.
ఇశ్రాయేలువారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును , ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును , పర్వతములను చూచిమమ్మును మరుగుచేయుడనియు , కొండలను చూచిమామీద పడుడనియు వారు చెప్పుదురు .
షోమ్రోనూ , ఆయన నీ దూడను (విగ్రహము) విసర్జించెను నా కోపము వారిమీదికి రగులుకొనెను . ఎంతకాలము వారు పవిత్రత నొంద జాలకుందురు ?
అది ఇశ్రాయేలువారి చేతి పనియే గదా? కంసాలి దానిని చేసెను , అది దైవము కాదు గదా; షోమ్రోను చేసికొనిన యీ దూడ ఛిన్నాభిన్నములగును .
ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను . దాగోనుయొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడప దగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి యుండెను.
అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవతా పట్టణములోని సూర్యప్రతిమలను విరుగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును.
నీచేతి పనికి నీవు మ్రొక్క కుండునట్లు చెక్కిన విగ్రహములును దేవతా స్తంభములును నీ మధ్య ఉండకుండ నాశనముచేతును ,
ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు -ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకము రాకుండ దేశము లోనుండి నేను వాటిని కొట్టివేతును ; మరియు ప్రవక్తలను అపవి త్రాత్మను దేశము లో లేకుండచేతును .