పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కని యున్నాడు.
వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను.
వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును.
నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.
కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు.
కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును.
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికివేయబడుదురు వారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు.
అప్పుడతడు తండ్రీ , ఆలాగైతే నా కయిదుగురు సహోదరు లున్నారు .
వారును ఈ వేదనకరమైన స్థలమునకు రా కుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నా ననెను .
భక్తిహీనులు దేశములోనుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.