వారు తమ హృదయమును కఠినపరచుకొనియున్నారు వారి నోరు గర్వముగా మాటలాడును.
తరిమెదను కలిసికొనియెదను దోపుడుసొమ్ము పంచుకొనియెదను వాటివలన నా ఆశ తీర్చుకొనియెదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువనుకొనెను.
యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాట లాడకుడి గర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి .
ఫిలిష్తీయుడు -కఱ్ఱ తీసికొని నీవు నా మీదికి వచ్చుచున్నావే , నేను కుక్కనా ? అని దావీదు తో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను .
నా దగ్గరకు రమ్ము , నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదు తో అనగా
నర పుత్రుడా , తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా గర్విష్ఠుడవై నే నొక దేవతను , దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై యున్నాను అని నీవనుకొను చున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నావు , నీవు దానియేలు నకంటె జ్ఞానవంతుడవు , నీకు మర్మమైనదేదియు లేదు .
నేను దేవుడనని నిన్ను చంపువాని యెదుట నీవు చెప్పుదువా ? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా.
ఐగుప్తు రాజైన ఫరో , నైలునది లో పండుకొనియున్న పెద్ద మొసలీ , నేను నీకు విరోధిని ; నైలునది నాది, నేనే దాని కలుగ జేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే ;
రాజు -బబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలా ధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను .
రాజు నోట ఈ మాట యుండగా ఆకాశము నుండి యొక శబ్దము వచ్చెను , ఏదనగా-రాజగు నెబుకద్నెజరూ , యిదే నీకు ప్రకటన నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను .
నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటిమధ్యను లేచెను ; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికివేయబడినవి . ఈ కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను.
ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును ; అతడు పండుగ కాలములను న్యాయపద్ధతులను నివారణచేయ బూనుకొనును ; వారు ఒక కాలము కాలములు అర్థ కాలము అతని వశమున నుంచబడుదురు .
యెహోవా సెలవిచ్చునదేమనగా -నన్నుగూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి-నిన్నుగూర్చి యేమి చెప్పితి మని మీరడుగుదురు .
వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించుకొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు.
వారు తమ దురాశలచొప్పున నడుచుచు,లాభమునిమిత్తము మనుష్యులను కొనియాడుచు, సణుగువారును తమ గతినిగూర్చి నిందించువారునై యున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును.
డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు నలువదిరెండునెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయెను
జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు