యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను.
నేను వారిని యెహోవాయందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు;ఇదే యెహోవా వాక్కు .
అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందె
నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.
క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను,
నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను .
ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు , ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తి నిబట్టి సంపూర్ణ బలము తో బలపరచబడవలెననియు ,
ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేయును ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపును.
భూమియొక్క ఉన్నతస్థలములమీద వాని నెక్కించెను పొలముల పంట వానికి తినిపించెను కొండబండనుండి తేనెను చెకుముకి రాతిబండనుండి నూనెను అతనికి జుఱ్ఱించెను.
ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.
నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.
నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు?
యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి. నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును.
భయమునొంది పాపము చేయకుడి మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.)
నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి
మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.
వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతోషముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి.
యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.
యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము.
యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్ను బాగుచేయుము
నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?
యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము నీ కృపనుబట్టి నన్ను రక్షించుము.
మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు?
నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవు చున్నది.
విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.
యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపముచేయు వారలారా, మీరందరు నాయొద్దనుండి తొలగిపోవుడి.
యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడు యెహోవా నా ప్రార్థన నంగీకరించును.
నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.
దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమునుబట్టి నాకు న్యాయము తీర్చుము.
దేవా, నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము.
అన్యులు నా మీదికి లేచియున్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు వారు తమయెదుట దేవుని ఉంచుకొన్నవారు కారు. (సెలా.)
ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు
నా శత్రువులు చేయు కీడు ఆయన వారిమీదికి రప్పించును నీ సత్యమునుబట్టి వారిని నశింపజేయుము సేచ్చార్పణలైన బలులను నేను నీకర్పించెదను.
యెహోవా, నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
ఆపదలన్నిటిలోనుండి ఆయన నన్ను విడిపించియున్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది.
దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవైయుండకుము.
నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము.
శత్రువుల శబ్దమునుబట్టియు దుష్టులబలాత్కారమునుబట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను.వారు నామీద దోషము మోపుచున్నారు ఆగ్రహముగలవారై నన్ను హింసించుచున్నారు.
నా గుండె నాలో వేదనపడుచున్నది మరణభయము నాలో పుట్టుచున్నది
దిగులును వణకును నాకు కలుగుచున్నవి మహా భయము నన్ను ముంచివేసెను.
ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగానుందునే
త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని
అరణ్యములో నివసించియుందునే అనుకొంటిని.
పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.
రాత్రింబగళ్లు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి.
దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి.
నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును నామీద మిట్టిపడువాడు నాయందు పగపట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును.
ఈ పనిచేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు.
మనము కూడి మధురమైన గోష్ఠిచేసియున్నవారము ఉత్సవమునకు వెళ్లు సమూహముతో దేవుని మందిరమునకు పోయియున్నవారము.
వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు గాక చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమునందును ఉన్నది
అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును.
సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును
నా శత్రువులు అనేకులైయున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు.
పురాతనకాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు, మారుమనస్సు లేనివారై తనకు భయపడనివారికి ఉత్తరమిచ్చును.
తమతో సమాధానముగానున్నవారికి వారు బలాత్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.
వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగానున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.
నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.
దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమి్మకయుంచియున్నాను.