
నేను నీ కనుగ్రహించిన నా ప్రభావముచేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని.
తూర్పునుండియైనను పడమటినుండియైనను అరణ్యమునుండియైనను హెచ్చుకలుగదు.
దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును
ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి , రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు .
రాజా , పరలోమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించియున్నాడు ; తమరు రాజులకు రాజైయున్నారు .
ఆయన మనుష్యులు నివసించు ప్రతిస్థలమందును , మనుష్యులనేమి భూ జంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటిని ఆయన తమరి చేతి కప్పగించియున్నాడు , వారందరి మీద తమరికి ప్రభుత్వము ననుగ్రహించియున్నాడు; తామే ఆ బంగారపు శిరస్సు
రాజా , ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది; నీవు వృద్ధిపొంది మహా బలముగలవాడవైతివి ; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తాయెను ; నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించియున్నది.
చెట్టును నరుకుము , దాని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము ; ఇనుము ఇత్తిడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడచు వరకు పొలములోని పచ్చికలో దాని కట్టించి, ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువుల తో పాలుపొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా.
రాజా , యీ దర్శనభావమేదనగా , సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా యేలినవాని గూర్చి చేసిన తీర్మాన మేదనగా
తమయొద్ద నుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు , నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు ; ఆకాశపు మంచు నీమీదపడి నిన్ను తడుపును ; సర్వోన్నతుడగుదేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడనియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొను వరకు ఏడు కాలములు నీకీలాగు జరుగును .
అయితే అతడు మనస్సున అతిశయించి , బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసికొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను .
అప్పుడతడు మానవుల యొద్దనుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయెను . మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు , ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలిసికొను వరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను.
బెల్షస్సరూ , అతని కుమారుడవగు నీవు ఈ సంగతియంతయు ఎరిగియుండియు , నీ మనస్సును అణచు కొనక , పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి .
ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి యుంచుకొని వాటితో త్రాగుచు , చూడ నైనను విన నైనను గ్రహింప నైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచ లేదు .
మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎత్తయిన దేవదారువృక్షపు పైకొమ్మ యొకటి నేను తీసి దాని నాటుదును, పైగా నున్నదాని శాఖలలో లేతదాని త్రుంచి అత్యున్నతపర్వతముమీద దాని నాటుదును.
దాని కొమ్మల నీడను అవి దాగును; మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవు నట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమియందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాని నెరవేర్చెదను.
చెట్లు తమమీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనను మనస్సుకలిగి బయలుదేరి
మమ్మును ఏలుమని ఒలీవచెట్టు నడుగగా ఒలీవచెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యకమాని చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.
అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా
అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా? అని వాటితో అనెను.
అటుతరువాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా ద్రాక్షావల్లి
దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్లమీద రాజునై యుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.
అప్పుడు చెట్లన్నియు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్లపొదయొద్ద మనవిచేయగా
ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరినయెడల రండి నా నీడను ఆశ్రయించుడి; లేదా అగ్ని నాలోనుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను.
నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించెను.
అయితే మీరు నా తండ్రి కుటుంబముమీదికి లేచి, యొక రాతిమీద అతని కుమారులైన డెబ్బదిమంది మనుష్యులను చంపి, అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారిమీద అతనిని రాజుగా నియమించి యున్నారు. యెరుబ్బయలు ఎడలను అతని యింటి వారియెడలను మీరు ఉపకారము చేయకయు
అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకొనిన విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన యెడల
నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని యింటివారి యెడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన యెడల, అబీమెలెకునందు సంతోషించుడి అతడు మీ యందు సంతోషించునుగాక.
లేనియెడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెమువారిని మిల్లో యింటి వారిని కాల్చివేయునుగాక, షెకెమువారిలోనుండియు మిల్లో యింటినుండియు అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి
పొలమును దానియందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక . వనవృక్షములన్నియు ఉత్సాహధ్వని చేయునుగాక.
భూజనులకు తీర్పుతీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతనుబట్టి జనములకు ఆయన తీర్పుతీర్చును .
మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును.
దేవదారు వృక్షములు కూలెను , వృక్షరాజములు పాడైపోయెను ; సరళవృక్షములారా, అంగలార్చుడి చిక్కని అడవి నరకబడెను ; సింధూరవృక్షములారా, అంగలార్చుడి .
అతనికి గొఱ్ఱల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయపడిరి.
అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను.
దావీదు మిగుల సుబుద్ధిగలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి యధికముగా అతనికి భయపడెను.
క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?
మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నమువలెనున్నది.
ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?
కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేతదేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.