ఎడముగా ఉండుము
మత్తయి 9:11

పరిసయ్యులు అది చూచిమీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి.

లూకా 5:30

పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచిసుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి.

లూకా 7:39

ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్తయైన యెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును ; ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను .

లూకా 15:2
పరిసయ్యులును శాస్త్రులును అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి .
లూకా 15:28-30
28

అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ల నొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను .

29

అందుకతడు తన తండ్రితో ఇదిగో యిన్ని యేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే , నీ ఆజ్ఞను నేనెన్నడును మీర లేదే ; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు .

30

అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను .

లూకా 18:9-12
9

తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను.

10

ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయము నకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి.

11

పరిసయ్యుడు నిలువబడి దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

12

వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను.

అపొస్తలుల కార్యములు 22:21

అందుకు ఆయన వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను.

అపొస్తలుల కార్యములు 22:22

ఈ మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పడు ఇటువంటివాడు బ్రదుకతగడు, భూమిమీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి.

రోమీయులకు 2:17-29
17

నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా?

18

ఆయన చిత్త మెరిగి , ధర్మశాస్త్ర మందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్ఠమైనవాటిని మెచ్చుకొనుచున్నావు కావా?

19

జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి -నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను ,

20

చీకటి లో ఉండువారికి వెలుగును , బుద్ధిహీనులకు శిక్షకుడను , బాలురకు ఉపాధ్యాయుడనై యున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా ?

21

ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించు కొనవా ? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా ?

22

వ్యభిచరింప వద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా ? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా ?

23

ధర్మశాస్త్ర మందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపరచెదవా ?

24

వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది ?

25

నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా , సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడవైతివా , నీ సున్నతి సున్నతి కాకపోవును .

26

కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతివిధులను గైకొనిన యెడల అతడు సున్నతి లేనివాడై యుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా ?

27

మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా?

28

బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు ; శరీర మందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు .

29

అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు . మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మ యందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు . అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు దేవుని వలననే కలుగును.

యూదా 1:19

అట్టివారు ప్రకృతి సంబంధులును ఆత్మ లేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు.

వీరు
సామెతలు 6:16

యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు

సామెతలు 6:17

అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును

సామెతలు 10:26

సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసువంటివాడు కండ్లకు పొగవంటివాడు.

సామెతలు 16:5

గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు.

యాకోబు 4:6

కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేతదేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.

1 పేతురు 5:5

చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.

అగ్ని
ద్వితీయోపదేశకాండమ 29:20

అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యునిమీద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండ తుడిచివేయును.

ద్వితీయోపదేశకాండమ 32:20-22
20

ఆయన ఇట్లనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదను వారు మూర్ఖచిత్తముగలవారు విశ్వాసములేని పిల్లలు.

21

వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.

22

నా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును.