(వినుము)
యెషయా 42:23

మీలో ఎవడు దానికి చెవి యొగ్గును ? రాబోవుకాలమునకై ఎవడు ఆలకించి వినును ?

యెషయా 48:16-18
16

ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను

17

నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును .

18

నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్ర తరంగములవలెను ఉండును .

యెషయా 55:3

చెవి యొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును .

కీర్తనల గ్రంథము 81:11-13
11

అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి .

12

కాబట్టి వారు తమ స్వకీయాలోచనలనుబట్టి నడుచుకొనునట్లు వారి హృదయకాఠిన్యమునకు నేను వారినప్పగించితిని .

13

అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంత మేలు!

యిర్మీయా 4:7

పొదలలో నుండి సింహము బయలుదేరియున్నది; జనముల వినాశకుడు బయలుదేరియున్నాడు, నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి యున్నాడు, నీ పట్టణములు పాడై నిర్జనముగానుండును.

లూకా 13:34

యెరూషలేమా , యెరూషలేమా , ప్రవక్తలను చంపుచు , నీ యొద్దకు పంప బడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ ప్లిలలను చేర్చుకొనవలెనని యుంటినిగాని మీ రొల్లకపోతిరి .

హెబ్రీయులకు 3:7

మరియు పరిశుద్ధాత్మ యిట్లు చెప్పుచున్నాడు.

హెబ్రీయులకు 3:8

నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.

యాకోబూ
యెషయా 41:8

నా సేవకుడవైన ఇశ్రాయేలూ , నేనేర్పరచుకొనిన యాకోబూ ,నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా ,

యెషయా 43:1

అయితే యాకోబూ , నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ , నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయ పడకుము , పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

ఆదికాండము 17:7

నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.

ద్వితీయోపదేశకాండమ 7:6-8
6

నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను.

7

మీరు సర్వజనముల కంటె విస్తారజనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనములకంటె మీరు లెక్కకు తక్కువేగదా.

8

అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను.

కీర్తనల గ్రంథము 105:6

ఆయన చేసిన సూచక క్రియలను ఆయననోటి తీర్పులను జ్ఞాపకముచేసికొనుడి

కీర్తనల గ్రంథము 105:42

ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తనసేవకుడైన అబ్రాహామును జ్ఞాపకము చేసికొని

కీర్తనల గ్రంథము 105:43

ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకొనినవారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించెను .

యిర్మీయా 30:10

మరియు యెహోవా సెలవిచ్చునదే మనగానా సేవకుడవైన యాకోబూ, భయపడకుము; ఇశ్రాయేలూ, విస్మయమొందకుము,నేను దూరముననుండు నిన్నును, చెరలోనికి పోయిన దేశముననుండు నీ సంతానపువారిని రక్షించుచున్నాను; బెదరించువాడు లేకుండ యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును.

యిర్మీయా 46:27

నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము ఇశ్రాయేలూ, జడియకుము దూరములోనుండి నిన్ను రక్షించుచున్నాను వారున్న చెరలోనుండి నీ సంతతివారిని రక్షించుచున్నాను ఎవరి భయమును లేకుండ యాకోబు తిరిగివచ్చును అతడు నిమ్మళించి నెమ్మదినొందును.

యిర్మీయా 46:28

నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడైయున్నాను భయపడకుము నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశప్రజలను సమూల నాశనముచేసెదను అయితే నిన్ను సమూల నాశనముచేయను నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమునుబట్టి నిన్ను శిక్షించెదను ఇదే యెహోవా వాక్కు.

రోమీయులకు 11:5

ఆలాగుననే అప్పటి కాల మందు సయితము కృపయొక్క యేర్పాటు చొప్పున శేషము మిగిలి యున్నది .

రోమీయులకు 11:6

అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు ; కానియెడల కృప ఇకను కృప కాకపోవును .