సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని యెడల మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమాన ముగా ఉందుము.
దానిలో పదియవ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సిందూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలె నుండును; అట్టి మొద్దునుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును.
ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబికులలో తప్పించుకొనినవారును తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు.
శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవునివైపు తిరుగును.
నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకవలె ఉండినను దానిలో శేషమే తిరుగును, సమూలనాశనము నిర్ణయింపబడెను. నీతి ప్రవాహమువలె వచ్చును
చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయునట్లుండును రెఫాయీము లోయలో ఒకడు పరిగె యేరునట్లుండును
అయినను ఒలీవచెట్లు దులుపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలియుండునట్లు ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు మూడు నాలుగు పండ్లు మిగిలియుండునట్లు దానిలో పరిగె పండ్లుండునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఖడ్గము తప్పించుకొనువారు కొద్దిమందియై ఐగుప్తుదేశములో నుండి యూదాదేశమునకు తిరిగి వచ్చెదరు, అప్పడు ఐగుప్తుదేశములో కాపురముండుటకు వెళ్లిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో, నాదో తమదో అది తెలిసికొందురు.
అయినను మీరు ఆ యా దేశములలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొను కొందరిని నేను మీలో శేషముగా అన్యజనులమధ్య ఉండనిచ్చెదను .
మరియు నన్ను విసర్జించినవారి విశ్వాస ఘాతకమైన వ్యభిచార మనస్సును , విగ్రహముల ననుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నాతట్టు తిరుగజేయగా , చెరపట్టబడినవారై శేషించినవారు అన్యజనులమధ్య నన్ను జ్ఞాపకము చేసికొని , తామనుసరించిన హేయకృత్యము లన్నిటినిబట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు
నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు ; ఈ కీడు వారికి చేసెదనని నేను చెప్పినమాట వ్యర్థము కాదు .
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములనుబట్టి అయ్యో అని అంగలార్చుము ; ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారు కూలుదురు .
వారిలో ఎవరైనను తప్పించుకొనిన యెడల వారందరును లోయలోని గువ్వలవలె పర్వతములమీదనుండి తమ దోషములనుబట్టి మూల్గులిడుదురు.
యెహోవా యెరూషలేమను ఆ పట్టణము లో ప్రవేశించి చుట్టు తిరిగి , దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూల్గు లిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయుమని వారి కాజ్ఞాపించి
నేను వినుచుండగా వారికీలాగు సెలవిచ్చెను మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధస్థలము దగ్గర మొదలుపెట్టి , కటాక్షమైనను కనికరమైనను లేకుండ అందరిని హతము చేయుడి.
అందరు నశించునట్లు ఎవరిని విడిచిపెట్టక, పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని, ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్ట కూడదు . వారు మందిరము ముందరనున్న పెద్దలను హతముచేయ మొదలు పెట్టగా
కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆ యా దేశములలో వారిని చెదరగొట్టినను , వారు వెళ్ళిన ఆ యా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును .
కాగా నీవు ఈ మాట ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ యా జనముల మధ్యనుండి నేను మిమ్మును సమకూర్చి , మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మును రప్పించి , ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసెదను .
వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచియున్న విగ్రహములను తీసివేసి , తాము చేసియున్న హేయక్రియలు చేయుట మానుదురు.
వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి , వారికి ఏక మనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును .
అప్పుడు వారు నాకు జనులై యుందురు నేను వారికి దేవుడనై యుందును .
దానిలో కుమాళ్ల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును, వారు బయటికి రప్పింపబడెదరు, మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లు వారు బయలుదేరి మీ యొద్దకు వచ్చెదరు, దాని గుర్తుపట్టి యెరూషలేముమీదికి నేను రప్పించిన కీడునుగూర్చియు దానికి నేను సంభవింప జేసినదంతటిని గూర్చియు మీరు ఓదార్పు నొందుదురు
మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసిన దంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలిసికొని ఓదార్పు నొందుదురు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
యాకోబు సంతతీ, తప్పక నేను మిమ్మునందరిని పోగుచేయుదును , ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును . బొస్రా గొఱ్ఱలు కూడునట్లు వారిని సమకూర్చుదును , తమ మేతస్థలములలో వారిని పోగుచేతును , గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు.
ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచ బడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.
తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింప లేదు . ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా ?
ప్రభువా , వారు నీ ప్రవక్తలను చంపిరి , నీ బలిపీఠములను పడగొట్టిరి , నే నొక్కడనే మిగిలియున్నాను , నా ప్రాణము తీయ జూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు .
అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది ? బయలుకు మోకా ళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.
ఆలాగుననే అప్పటి కాల మందు సయితము కృపయొక్క యేర్పాటు చొప్పున శేషము మిగిలి యున్నది .
అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు ; కానియెడల కృప ఇకను కృప కాకపోవును .
అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడ సంచరించెదరు.
ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచిపెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.
నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.