యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.
ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించుకొందురు?
జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టములేకపోయెను.
నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి.
మూఢుడు తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును.
దిద్దుబాటు నీకు అసహ్యము గదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు.
నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగమువంటివాడనైతిని.
అయితే వారు ఆలకింప నొల్లక మూర్ఖులై వినకుండ చెవులు మూసికొనిరి .
ధర్మశాస్త్రమును , పూర్వికలైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణచేత తెలియజేసిన మాటలను , తాము వినకుండునట్లు హృదయములను కురువిందమువలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్దనుండి మహో గ్రత వారిమీదికి వచ్చెను .
కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా - నేను పిలిచినప్పుడు వారు ఆలకిం పకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకిం పను .
మరియు వారెరు గని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచినమీదట అందులో ఎవరును సంచరింపకుండ అది పాడగును ; ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసియున్నారు .
ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
దుష్కార్యము చేయు4 ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.
నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసివేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి.
ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.
శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు
శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.
ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారునీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారువీడెవడో మనలోనికి పరదేశిగావచ్చి తీర్పరిగానుండ చూచుచున్నాడు; కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి లోతు అను ఆ మనుష్యునిమీద దొమి్మగాపడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి.
మరునాడు అతడు బయట నడిచి వెళ్లుచుండగా హెబ్రీయులైన మనుష్యులిద్దరు పోట్లాడుచుండిరి.
అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి నీ వేల నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే - నిశ్యముగా ఈ సంగతి బయలుపాడెననుకొని భయపడెను.
అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యామీదికి రాగా అతడు జనులయెదుట నిలువబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు; మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను.
అందుకు వారతనిమీద కుట్రచేసి, రాజు మాటనుబట్టి యెహోవా మందిరపు ఆవరణములోపల రాళ్లు రువి్వ అతని చావగొట్టిరి.
ఈ ప్రకారము రాజైన యోవాషు జెకర్యా తండ్రియైన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను; అతడు చనిపోవునప్పుడు యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక యనెను.
అతడు అమజ్యాతో మాటలాడుచుండగా రాజు అతని చూచినీవు రాజుయొక్క ఆలోచనకర్తలలో ఒకడవైతివా? ఊరకొనుము;నేను నిన్ను చంపనేల అని చెప్పగా ఆ ప్రవక్త నీవు ఈలాగున చేసి నా ఆలోచనను అంగీకరింపకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపజేయనుద్దేశించి యున్నాడని నాకు తెలియునని చెప్పి యూరకొనెను.
యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి.
కాబట్టి యెహోవా అష్షూరురాజుయొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొనిపోయిరి.
పెందలకడ లేచి పంపుచువచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.
మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచువచ్చితిని గాని
మీరు మీ పితరులవంటివారై యుండవద్దు; పూర్వికులైన ప్రవక్తలు-సైన్యములకు అధిపతియగు6635 యెహోవా సెలవిచ్చునదేమనగా-మీ దుర్మార్గతను మీ దుష్‌క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి; ఇదే యెహోవా వాక్కు.
మీ పితరులేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రదుకుదురా?
అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి-మన ప్రవర్తననుబట్టియు క్రియలనుబట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి.