
లాభమునొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయువానికిని ధనవంతుల కిచ్చువానికిని నష్టమే కలుగును.
దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు.
దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు.
దరిద్రుడు బతిమాలి మనవి చేసికొనును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును.
యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మి వేయుదురు; పాదరక్షల కొరకై బీదవారిని అమ్మి వేయుదురు.
షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా , దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టువారలారా మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా , యీ మాట ఆలకించుడి . ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా
దోషనివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు , గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుటవలన
మీ అపరాధములు విస్తారములైనవనియు , మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును . దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపుర ముండరు , శృంగారమైన ద్రాక్షతోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రా గరు .
దేశమందు బీదలను మింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా,
దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.
అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్న వారు వీరే గదా?
ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి యేడువుడి.
ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.
అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను ; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది ; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి యున్నాడని ఎలీషాకు మొఱ్ఱ పెట్టగా
మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూములమీదను మా ద్రాక్షతోటలమీదను మేము అప్పుచేసితివిు.
మా ప్రాణము మా సహోదరుల ప్రాణమువంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసివచ్చెను; ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వములో నున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశముననుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా
ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొనువారికి కలుగును వడ్డికిచ్చువారికి కలిగినట్లు వడ్డికి తీసుకొనువారికి కలుగును.
అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమి్మ, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను.