అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులైయున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.
వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొఱ్ఱ వినువా?
కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమునుబట్టి మొఱ్ఱపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తరమిచ్చుటలేదు.
వారు మొఱ్ఱపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను యెహోవాకు వారు మొఱ్ఱపెట్టుదురు గాని ఆయనవారి కుత్తరమియ్యకుండును.
మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.
కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతాము తప్పించుకొనజాలని కీడు వారిమీదికి రప్పింపబోవు చున్నాను, వారు నాకు మొఱ్ఱపెట్టినను నేను వారి మొఱ్ఱను వినకుందును.
వారు ఉపవాసమున్నప్పుడు నేను వారి మొఱ్ఱను వినను; వారు దహనబలియైనను నైవేద్యమైనను అర్పించు నప్పుడు నేను వాటిని అంగీకరింపను; ఖడ్గమువలనను క్షామమువలనను తెగులువలనను వారిని నాశము చేసెదను
కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొఱ్ఱపెట్టినను నేను ఆలకింప కుందును.
వారు దుర్మార్గత ననుసరించి నడుచుకొనియున్నారు గనుక వారు యెహోవా కు మొఱ్ఱపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండ తన్ను మరుగుచేసికొనును .
కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా - నేను పిలిచినప్పుడు వారు ఆలకిం పకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకిం పను .
ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి;
అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చిఅయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా
అతడుమిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా , మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు
ఆయన మీరెక్కడివారో మిమ్మును ఎరుగ నని ఉత్తరము మీతో చెప్పును . అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే ; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్ప సాగుదురు .
అప్పుడాయన మీ రెక్కడివారో మిమ్మును ఎరుగ నని మీతో చెప్పు చున్నాను ; అక్రమము చేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును .
అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు , మీరు చూచు నప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు .
మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.
వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి .
దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసికొనిరి .
అయినను వారి హృదయము ఆయనయెడల స్థిరముగానుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు
వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలము నకు పోవుదును ; తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు.
మనము యెహోవా యొద్దకు మరలుదము రండి , ఆయన మనలను చీల్చివేసెను , ఆయనే మనలను స్వస్థపరచును ; ఆయన మనలను కొట్టెను , ఆయనే మనలను బాగుచేయును
రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును , మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును .
యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును ; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును ; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.
ఎఫ్రాయిమూ , నిన్ను నేనేమి చేతును ? యూదా , నిన్ను నేనేమి చేతును ? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువకపోవును .