పశుప్రాయులు
కీర్తనల గ్రంథము 32:9

బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిదవలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను కళ్లెముతోను బిగింపవలెను.

కీర్తనల గ్రంథము 73:22

నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగమువంటివాడనైతిని.

కీర్తనల గ్రంథము 94:8
జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు?
సామెతలు 30:2

నిశ్చయముగా మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు.

యెషయా 1:3

ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

యిర్మీయా 10:14

తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందు చున్నాడు; అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియు లేదు.

1 కొరింథీయులకు 2:14

ప్రకృతిసంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.

అవివేకులు
కీర్తనల గ్రంథము 14:1

దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు.

కీర్తనల గ్రంథము 49:10

జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండపోదు మూర్ఖులును పశుప్రాయులును ఏకముగా నశింతురు.

కీర్తనల గ్రంథము 75:4

అహంకారులైయుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను.

సామెతలు 1:22

ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించుకొందురు?

సామెతలు 24:7

మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులైయుందురు.

లూకా 12:20

అయితే దేవుడు వెఱ్ఱివాడా , యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు ; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను .