సైన్యములకధిపతివగు యెహోవా , నీయందు నమ్మికయుంచువారు ధన్యులు .
దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు; సంగతి ఆయనకు తెలియును, ఇశ్రాయేలీయులు తెలిసికొందురు, ద్రోహము చేతనైనను యెహోవామీద తిరుగుబాటుచేతనైనను మేము ఈ పని చేసినయెడల నేడు మమ్ము బ్రదుకనియ్యకుడి.
మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై యుండకుడి భూమియందంతట నాశనము ఖండితముగా నియమింపబడెను ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను దాని సమాచారము వింటిని
పరాక్రమముగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది .
మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా.
నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను .
బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగా నేనేయున్నానని ఆయన యనును న్యాయవిధినిగూర్చి వాదము కలుగగా ప్రతివాదిగానుండ తెగించువాడెవడని ఆయన యనును?
నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు ? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు .
మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను ? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధిక శక్తిచేతను తనకు కలిగియున్న బలా తిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచి పెట్టడు .
యెహోవా, ప్రభువా సైన్య ములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధికబలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు.
మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి1 మమ్మును తప్పించుము.
మింటను యెహోవాకు సాటియైనవాడెవడు ? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు ?
అప్పుడు యెహోవా నీవంటివాడెవడు? మించిన బలముగలవారి చేతినుండి దీనులను దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును.
దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటియైన వాడెవడు?
వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గమువంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పరులు.
యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియు లేదు .