నీవు దీనిని చూచియున్నావు గదా, వారికి ప్రతికారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు
దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు చీకటిలో యథార్థహృదయులమీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు
వాడు మంచముమీదనే పాపయోచనను యోచించును వాడు కానినడతలు నడచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు.
మోసము చేయువాడా, వాడిగల మంగల కత్తివలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది
పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.
రాత్రింబగళ్లు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి.
దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి.
కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.
అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.
మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ ; ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు .
వారు భూములు ఆశించి పట్టుకొందురు , ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు , ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు .
కాబట్టి యెహోవా సెలవిచ్చునదేమనగా --గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రిందనుండి తమ మెడలను తప్పించుకొన లేకుండునంతగాను , గర్వముగా నడువ లేకుండునంతగాను ఈ వంశమునకు కీడుచేయ నుద్దేశించుచున్నాను .
ఆ సమయమున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి
యేసును మాయోపాయముచేత పట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచన చేసిరి.
ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ.
లంచము తీసికొనకూడదు; లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును.
నీవు న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు; పక్షపాతము చేయకూడదు; లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును.
వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుస రింపక , ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా
నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధనవలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని హత్య యను మాట వినకుండ చెవులు మూసికొని చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు ఉన్నతస్థలమున నివసించును.
నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు .
నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరచుకొనుచున్నాను .
మీ అపరాధములు విస్తారములైనవనియు , మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును . దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపుర ముండరు , శృంగారమైన ద్రాక్షతోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రా గరు .
రెండు చేతులతోను కీడు చేయ పూనుకొందురు , అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు . ఆలాగున వారు ఏకపట్టుగానుండి దాని ముగింతురు.