నాకొకమాట రహస్యముగా తెలుపబడెను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను.
గాఢనిద్ర మనుష్యులకు వచ్చు సమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను.
భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను.
ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను.
అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేకపోతిని ఒక రూపము నా కన్నులయెదుటనుండెను మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?
తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా?
ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు.
జిగటమంటి యిండ్లలో నివసించువారియందు మంటిలో పుట్టినవారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?
ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండి వారు బద్దలైపోవుదురు ఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు.
వారి డేరాత్రాడు తెగవేయబడును వారు బుద్ధికలుగకయే మృతినొందుదురు.ఆలాగుననే జరుగుచున్నది గదా.
నరులు గర్విష్ఠులు కాకుండచేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొనచేయునట్లు
భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు ఆకాశపక్షులకంటె మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అనుకొనువారెవరును లేరు.
అంతరింద్రియములలో జ్ఞానముంచినవాడెవడు? హృదయమునకు తెలివినిచ్చినవాడెవడు?
మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు.
నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను; బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను; పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు, ఇకమీదట నీవంటివాడొకడును ఉండడు.
అంతట ఇశ్రాయేలీయులందరును రాజు తీర్చిన తీర్పునుగూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి.
దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను
యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.
ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును; అయితే దైవదృష్టికి ఇష్టుడగువాని కిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది.
ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను . మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను.
ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి , రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు .
మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.
ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు.
దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.
ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును,
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.