
కాబట్టి సౌలు అతని తనయొద్ద నుండనియ్యక సహస్రాధిపతిగా చేసెను; అతడు జనులకు ముందువచ్చుచు పోవుచు నుండెను.
ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించితిని
మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.
అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను–ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలును గూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.
సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను.
ఇశ్రాయేలీయులతోకూడ నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరమొకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా?
పాడిగొఱ్ఱలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను.
గొఱ్ఱలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.
నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు.
బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామ మైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.
ఆయన నిలిచి యెహోవా బలముపొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమునుబట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూ మ్యంతముల వరకు ప్రబలుడగును,
అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి,
పూర్వ కాలమున సౌలు మామీద రాజైయుండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు –నీవు ఇశ్రాయేలీయులనుబట్టి నా జనులను పాలించి వారిమీద అధిపతివై యుందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చియున్నాడని చెప్పిరి.
ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయచేయుము.
నీవు వెళ్లి యరొబాముతో చెప్పవలసినదేమనగా–ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు– నేను నిన్ను జనులలోనుండితీసి హెచ్చింపజేసి, ఇశ్రాయేలువారను నా జనులమీద నిన్ను అధికారిగా నియమించి