షేము కుమారులు
ఆదికాండము 10:22-32
22

షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.

23

అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.

24

అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.

25

ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.

26

యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును

27

హదోరమును ఊజాలును దిక్లాను

28

ఓబాలును అబీమాయెలును షేబను

29

ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు.

30

మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము.

31

వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు.

32

వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను.

ఆదికాండము 11:10

షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను.

ఏలాము
ఆదికాండము 14:1

షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో

యెషయా 11:11

ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులోనుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును

యెషయా 21:2

కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడియున్నది. మోసముచేయువారు మోసము చేయుదురు దోచుకొనువారు దోచుకొందురు ఏలామూ, బయలుదేరుము మాద్యా, ముట్టడివేయుము వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను.

యెషయా 22:6

ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబులపొదిని వహించియున్నది. కీరు డాలు పై గవిసెన తీసెను

యిర్మీయా 25:25

జిమీ రాజులందరును ఏలాము రాజులందరును మాదీయుల రాజులందరును

యెహెజ్కేలు 32:24

అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టు నున్నవి; అందరును కత్తి పాలై చచ్చిరి ; వారు సజీవుల లోకములో భయంకరులైనవారు , వారు సున్నతిలేనివారై పాతాళము లోనికి దిగిపోయిరి , గోతిలోనికి దిగిపోయిన వారితో కూడ వారు అవమానము నొందుదురు .

దానియేలు 8:2

నేను దర్శనము చూచుచుంటిని . చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను .

అష్షూరు
సంఖ్యాకాండము 24:22-24
22

అష్షూరు నిన్ను చెరగా పట్టువరకు కయీను నశించునా?

23

మరియు అతడు ఉపమానరీతిగా అయ్యో దేవుడు ఇట్లు చేయునప్పుడు ఎవడు బ్రదుకును?

24

కిత్తీము తీరమునుండి ఓడలు వచ్చును. అవి అష్షూరును ఏబెరును బాధించును. కిత్తీయులుకూడ నిత్యనాశనము పొందుదురనెను.

ఎజ్రా 4:2

జరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానులయొద్దకును వచ్చి మీరు ఆశ్రయించునట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హద్దోనుయొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి.

కీర్తనల గ్రంథము 83:8

అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు .(సెలా.)

అష్షూరు
యెహెజ్కేలు 27:23

హారానువారును కన్నేవారును ఏదెను వారును షేబ వర్తకులును అష్షూరు వర్తకులును కిల్మదు వర్తకులును నీతో వర్తకము చేయుదురు.

యెహెజ్కేలు 32:22

అష్షూరును దాని సమూహ మంతయు అచ్చటనున్నవి , దాని చుట్టును వారి సమాధులున్నవి , వారందరు కత్తి పాలై చచ్చియున్నారు .

హొషేయ 14:3

అష్షూరీయులచేత రక్షణ నొందగోరము , మేమికను గుఱ్ఱములను ఎక్కము -మీరే మాకు దేవుడని మేమికమీదట మా చేతి పనితో చెప్పము ; తండ్రిలేనివారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.

లూదు
యెషయా 66:19

నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకొనినవారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనుల యొద్దకును తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపెదను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదను వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు.

యెహెజ్కేలు 27:10

పారసీక దేశపువారును లూదు వారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయి లుగా ఉన్నారు , వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు , వారిచేత నీకు తేజస్సు కలిగెను .

అరాము
సంఖ్యాకాండము 23:7

అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను అరామునుండి బాలాకు తూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్నురప్పించిరమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను.

మెషెకు
ఆదికాండము 10:23

అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.