సెలవిచ్చు మాట ఆలకించుడి
మీకా 1:2

సకల జనులారా, ఆలకించుడి, భూమీ, నీవును నీలోనున్న సమస్తమును చెవి యొగ్గి వినుడి; ప్రభువగు యెహోవా మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు, పరిశుద్దా లయములోనుండి ప్రభువు మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు.

1 సమూయేలు 15:16

సమూయేలు -నీవు మాటలాడ పనిలేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలు తో అనగా, సౌలు -చెప్పుమనెను.

యిర్మీయా 13:15

చెవి యొగ్గి వినుడి; యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి.

ఆమోసు 3:1

ఐగుప్తు దేశమునుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీ యులారా, మిమ్మునుగూర్చియు ఆయన రప్పించిన కుటుంబమువారి నందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి.

హెబ్రీయులకు 3:7

మరియు పరిశుద్ధాత్మ యిట్లు చెప్పుచున్నాడు.

హెబ్రీయులకు 3:8

నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.

వ్యాజ్యెమాడుము
ద్వితీయోపదేశకాండమ 4:26

మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు.

ద్వితీయోపదేశకాండమ 32:1

ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాటలాడుదును భూమండలమా, నా నోటిమాట వినుము.

కీర్తనల గ్రంథము 50:1

దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు.

కీర్తనల గ్రంథము 50:4

ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై

యెషయా 1:2

యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

యిర్మీయా 22:29

దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినుము.

యెహెజ్కేలు 36:1

మరియు నర పుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి,

యెహెజ్కేలు 36:8

ఇశ్రాయేలు పర్వతములారా, యిక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులగు నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పెట్టి వారికొరకు మీ ఫలములు ఫలించుదురు.

లూకా 19:40

ఆయన వారిని చూచి– వీరు ఊరకుండిన యెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను.

సాక్ష్యముపెట్టి
మీకా 1:4

ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటముమీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును,

యెషయా 2:12-14
12

అహంకారాతిశయము గల ప్రతి దానికిని ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.

13

ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సిందూర వృక్షము లకన్నిటికిని

14

ఉన్నత పర్వతము లకన్నిటికిని ఎత్తయిన మెట్ల కన్నిటికిని

వినబడనిమ్ము.
యెహెజ్కేలు 37:4

అందుకాయన ప్రవచన మెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము ఎండిపోయిన యెముకలారా, యెహోవా మాట ఆలకించుడి.