
శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరి గాని అది వారివలన కాకపోయెను. పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండగా
శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను.
ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషేయెదుట నిలువలేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికిని పుట్టెను.
ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి యనిపించుకొనెను . పూర్వము ఇశ్రాయేలీయులలో దేవునియొద్ద విచారణచేయుటకై ఒకడు బయలుదేరినయెడల -మనము దీర్ఘదర్శి యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక.
నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే.
నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనము లగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతు వేమో
నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము.
వారు కొయ్యకాలు వలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొన లేక యున్నారు అది కాచుకొనుటకు నిప్పు కాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు.
కాలము ఉపాయముగా గడపవలెనని అబద్ధమును మోసపు మాటలను నాయెదుట పలుక నుద్దేశించియున్నారు. మీరు కలను చెప్ప లేకపోయిన యెడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలిసికొందును .
అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి -భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్ప జాలడు , ఏ చక్రవర్తియు అధికారియు శకునగానియొద్దను గారడీవిద్య గలవానియొద్దను కల్దీయునియొద్దను ఇట్టి సంగతి విచారింప లేదు .
రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది , దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్ప జాలరు ; దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా .
ఆ దినమున తాము పలికిన ప్రవచనములనుబట్టియు, తమకు కలిగిన దర్శనమునుబట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు .
యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాసవిషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు.
అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో ఆలాగే వీరిదికూడ అందరికి తేటపడును గనుక వీరు ఇకముందుకు సాగరు.
ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను.
మృతులకై విలాపముచేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము, నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను, నీ పెదవులు మూసికొన వద్దు జనుల ఆహారము భుజింపవద్దు
అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు, మీ పెదవులు మూసికొనకయుందురు, జనుల ఆహారమును మీరు భుజింపకయుందురు.
సౌలు -ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన యెడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవునియొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తర మియ్యక యుండెను.
యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవా స్వప్నముద్వారానైనను ఊరీముద్వారానైనను ప్రవక్తలద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను .
సమూయేలు -నన్ను పైకిరమ్మని నీవెందుకు తొందరపెట్టితివని సౌలు నడుగగా సౌలుspan class ; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నములద్వారానైనను నా కేమియు సెలవియ్యక యున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితి ననెను .
సూచకక్రియలు మాకు కనబడుటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు మాలో ఎవడును లేడు.
రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును ; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు .