యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా -మీరు నా జనులు కారు , నేను మీకు దేవుడనై యుండ ను గనుక లోఅమ్మీ (నాజనము కాదని) యితనికి పేరు పెట్టుము.
ఇశ్రాయేలీయుల జన సంఖ్య అ మితమై లెక్క లేని సముద్రపు ఇసుకంత విస్తారమగును ; ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననేమీరు జీవముగల దేవుని కుమారులైయున్నారని వారితో చెప్పుదురు .
యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని, తమ పైన నొకనినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశము లోనుండి బయలుదేరుదురు ; ఆ యెజ్రెయేలు దినము మహా ప్రభావముగల దినముగానుండును .
కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.
సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజకరూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా
ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.
వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.
అప్పుడు వారు నాకు జనులై యుందురు నేను వారికి దేవుడనై యుందును .
నేను మీ పితరుల కిచ్చిన దేశములో మీరు నివసించెదరు , మీరు నా జనులై యుందురు నేను మీ దేవుడనై యుందును .
నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు.
ఆ మూడవ భాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచి నట్లు శుద్ధపరతును . బంగారమును శోధించి నట్లు వారిని శోధింతును ; వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును . వీరు నా జనులని నేను చెప్పుదును , యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు .
నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును ; జాలి నొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితో -మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని యందురు ; ఇదే యెహోవా వాక్కు .
కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడినవారమై అధైర్యపడము.
నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.
ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.