
దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను
గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై యుండెను.
అతడు సమస్తమైన వారికంటెను, ఎజ్రాహీయుడైన ఏతానుకంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్ద అను వారికంటెను జ్ఞానవంతుడై యుండెను గనుక అతని కీర్తిచుట్టునున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను.
అతడు మూడువేల సామెతలు చెప్పెను, వెయ్యిన్ని యయిదు కీర్తనలు రచించెను.
మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటినన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను.
అతని జ్ఞానపుమాటలు తెలిసికొనుటకై అతని జ్ఞానమునుగూర్చి వినిన భూపతులందరిలోనుండియు,జనులందరిలోనుండియు మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి.
షేబ దేశపురాణి యెహోవా నామమును... గూర్చియు, సొలొమోనునకు కలిగిన కీర్తినిగూర్చియు విని, గూఢార్థముగల మాటలచేత అతనిని శోధించుటకై వచ్చెను.
ఆమె గొప్ప పరివారముతో, గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనముచేసి తనకు తోచినదానినంతటినిబట్టి అతనితో మాటలాడగా
ఆమె వేసిన ప్రశ్నలన్నిటికి సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను; రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసినవాటన్నిటి భావము చెప్పెను.
నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు .
మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; అయినను–దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.
నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి.
మా శత్రువులయొద్ద నివాసులైయున్న యూదులు వచ్చి నలుదిక్కులనుండి మీరు మా సహాయమునకు రావలెనని మాటిమాటికి మాతో చెప్పగా
పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.
కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడీవిద్యగలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువ నంపుడని యాజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలచిరి .
రాజు వారితో-నేనొక కల కంటిని , ఆ కల భావము తెలిసికొనవలెనని నేను మనో వ్యాకుల మొంది యున్నాననగా
కల్దీయులు సిరియాబాషతో ఇట్లనిరి -రాజు చిరకాలము జీవించునుగాక . తమరి దాసులకు కల సెలవియ్యుడి ; మేము దాని భావమును తెలియజేసెదము .
రాజు -నేను దాని మరచి పోతిని గాని, కలను దాని భావమును మీరు తెలియజేయని యెడల మీరు తుత్తునియలుగా చేయబడుదురు ; మీ యిండ్లు పెంటకుప్పగా చేయబడును .
కలను దాని భావమును తెలియజేసిన యెడల దానములును బహుమానములును మహా ఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు
రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పినయెడల మేము దాని భావమును
తెలియజేసెదమని మరల ప్రత్యుత్తరమిచ్చిరి . అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా-నేను మరచి యుండుట మీరు చూచి కాల హరణము చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను .
కాలము ఉపాయముగా గడపవలెనని అబద్ధమును మోసపు మాటలను నాయెదుట పలుక నుద్దేశించియున్నారు. మీరు కలను చెప్ప లేకపోయిన యెడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలిసికొందును .
అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి -భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్ప జాలడు , ఏ చక్రవర్తియు అధికారియు శకునగానియొద్దను గారడీవిద్య గలవానియొద్దను కల్దీయునియొద్దను ఇట్టి సంగతి విచారింప లేదు .
రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది , దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్ప జాలరు ; దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా .
శకునగాండ్రును గారడీవిద్యగలవారును కల్దీయులును జ్యోతిష్యులును నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుప లేక పోయిరి.
కడపట బెల్తెషాజరను నా దేవత పేరునుబట్టి బిరుదుపొందిన దానియేలనువాడు నా యెదుటికి వచ్చెను ; పరిశుద్ధ దేవతల ఆత్మ అతనియందుండెను , కావున నేనతనికి నా కలను చెప్పితిని .
ఎట్లనగా-శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరూ , పరిశుద్ధ దేవతల ఆత్మ నీయందున్నదనియు, ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నే నెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము .
నేను నా పడక మీద పరుండియుండగా నాకు ఈ దర్శనములు కలిగెను; నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల యొక చెట్టు కనబడెను .
ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను ; దాని పైకొమ్మలు ఆకాశము నకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూ తలమంత విశాలముగాను ఉండెను.
దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారముండెను ; దాని నీడను అడవి జంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను ; సకల మనుష్యులకు చాలునంత ఆహారము దానియందుండెను.
మరియు నేను నా పడక మీద పండుకొనియుండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా ,
జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగి వచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి ; పశువులను దాని నీడనుండి తోలివేయుడి ; పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టుడి.
అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించునట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి, పొలములోని గడ్డిపాలగునట్లు దానిని భూమిలో విడువుడి .
ఏడు కాలములు గడచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును.
ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి , తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆ యా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరుగును.
బెల్తెషాజరూ , నెబుకద్నెజరను నాకు కలిగిన దర్శనము ఇదే ; నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్ప నేరడు . నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవేదానిని చెప్ప సమర్థుడవంటిని .
రాజు గారడీవిద్యగలవారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువ నంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను -ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడినవాడై రాజ్యములో మూడవ యధిపతిగా ఏలును.
రాజు నియమించిన జ్ఞాను లందరు అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటయైనను దాని భావము తెలియజెప్పుటయైనను వారివల్ల కాకపోయెను .
అందుకు దానియేలు ఇట్లనెను -నీ దానములు నీయొద్ద నుంచుకొనుము , నీ బహుమానములు మరి ఎవనికైన నిమ్ము ; అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను .
తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్ర నందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడును లేకపోయెను.
అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములచేత ఆలాగే చేసిరి.
వారిలో ప్రతివాడును తన కఱ్ఱను పడవేసినప్పుడు అది సర్పమాయెనుగాని అహరోను కఱ్ఱ వారి కఱ్ఱలను మింగివేయగా
ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములవలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను.
శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి.
శకునగాండ్రు–ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను.
ఐగుప్తీయులయొక్క శౌర్యము నశించును వారి ఆలోచనశక్తిని నేను మాన్పివేసెదను కావున వారు విగ్రహములయొద్దకును గొణుగువారియొద్దకును కర్ణపిశాచిగలవారియొద్దకును సోదెగాండ్రయొద్దకును విచారింప వెళ్లుదురు.
నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనము లగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతు వేమో
నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము.
వారు కొయ్యకాలు వలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొన లేక యున్నారు అది కాచుకొనుటకు నిప్పు కాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు.
యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాసవిషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు.
అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో ఆలాగే వీరిదికూడ అందరికి తేటపడును గనుక వీరు ఇకముందుకు సాగరు.