
కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము . అప్పుడు నేను నిన్ను తెలిసికొందును ; చిత్తగించుము , ఈ జనము నీ ప్రజలేగదా అనెను.
కాగా యెహోవా నీవు చెప్పిన మాటచొప్పున చేసెదను ; నీమీద నాకు కటాక్షము కలిగినది , నీ పేరునుబట్టి నిన్ను ఎరుగుదునని మోషే తో చెప్పగా
అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును , నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా
మోషే నీ సన్నిధి రా ని యెడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము .
నాయెడలను నీ ప్రజలయెడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును ? నీవు మాతో వచ్చుటవలననే గదా? అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలును భూమి మీద నున్న సమస్త ప్రజల లోనుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను .
నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
మరియు యెహోవా ఇట్లనెను నేను ఈ ప్రజలను చూచియున్నాను ; ఇదిగో వారు లోబడ నొల్లని ప్రజలు .
మీరు లోబడ నొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడ రా ను ; త్రోవలో మిమ్మును సంహరించెద నేమో అని మోషే తో చెప్పెను .
ప్రజలు ఆ దుర్వా ర్తను విని దుఃఖించిరి ; ఎవడును ఆభరణములను ధరించుకొన లేదు .
కాగా యెహోవా మోషే తో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీ యుల తో మీరు లోబడనొల్లని ప్రజలు ; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా , మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియునట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనెను .
నీవు మూర్ఖుడవనియు నీ మెడ యినుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి
యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము.
కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.
యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్యభాగము యాకోబే.
నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము.
యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు.
తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను . ఆయన తన స్వాస్థ్యముమీద ఆగ్రహించెను
యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు .
యెహోవా తనకొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను.
యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటి వాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్య ములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు.
మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.