అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.
మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గ మును దయచేయుదును.
భూజనులందరియెదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్రకారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు, నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులువిని నేను వారికి కలుగజేయు సమస్తక్షేమమునుబట్టియు సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నొందుదురు.
తరువాత ఇశ్రాయే లీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.
మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.
నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా దేహమును చంపిన తరువాత మరేమియు చేయ నేరని వారికి భయ పడకుడి .
ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును ; చంపిన తరువాత నరకము లో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి , ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను .
లేదా , దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక , ఆయన అనుగ్రహై శ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా ?
మంచిది ; వారు అవిశ్వాసమునుబట్టి విరిచివేయబడిరి , నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు ; గర్వింపక భయపడుము ;
జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలక్రిందుచేయును
మరియు నేను ఆలోచింపగా సూర్యునిక్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధమునందు విజయమొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేతనే కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి.
తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొనువారికి శ్రమ.
ఆ సమయమున యేసు చెప్పినదేమనగాతండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.
ఆ గడియ లోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి -తండ్రీ , ఆకాశమునకును భూమికిని ప్రభువా , నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించు చున్నాను ; అవును తండ్రీ , ఆలాగు నీ దృష్టికి అనుకూల మాయెను .
సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని
ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే.జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;