ఫీనెహాసు
నిర్గమకాండము 6:25

అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒకతెను పెండ్లిచేసికొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను; వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు.

సంఖ్యాకాండము 25:7-13
7

యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి,

8

సమాజమునుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవునట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచి పోయెను.

9

ఇరువది నాలుగువేలమంది ఆ తెగులు చేత చనిపోయిరి.

10

అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,

11

వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు.

12

కాబట్టి నీవు అతనితో ఇట్లనుము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను.

13

అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

సంఖ్యాకాండము 31:6

మోషే వారిని, అనగా ప్రతి గోత్రమునుండి వేయేసిమందిని, యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను.

యెహొషువ 22:13

ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్ధ గోత్రపువారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి.

యెహొషువ 22:31

అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసు రూబేనీయులతోను గాదీయులతోను మనష్షీయులతోను మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము; ఇప్పుడు మీరు యెహోవా చేతిలోనుండి ఇశ్రాయేలీయులను విడిపించి యున్నారని చెప్పెను.

న్యాయాధిపతులు 20:28

అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దానియెదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరల మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా,మానుదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వెళ్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను.

1దినవృత్తాంతములు 6:4

ఎలియాజరు ఫీనెహాసును కనెను, ఫీనెహాసు అబీషూవను కనెను,

1దినవృత్తాంతములు 6:50-52
50

అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ,

51

అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్య,

52

జెరహ్య కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు,

కీర్తనల గ్రంథము 106:30

ఫీనెహాసు లేచి పరిహారముచేయగా ఆ తెగులు ఆగిపోయెను .

కీర్తనల గ్రంథము 106:31

నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను .

ఎలియాజరు
లేవీయకాండము 10:6

అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వసమాజముమీద ఆగ్రహపడకుండునట్లును, మీరు తల విరియబోసికొనకూడదు; బట్టలను చింపుకొనకూడదు కాని, యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల యింటివారందరు ఏడవ వచ్చును.

లేవీయకాండము 10:12

అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోను ఇట్లనెను మీరు యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసికొని అది పొంగకుండ బలిపీఠము దగ్గర తినుడి; అది అతిపరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యములోనుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడినవంతు.

లేవీయకాండము 10:16

అప్పుడు మోషే పాపపరిహారార్థబలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడు అది కాలిపోయియుండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారిమీద ఆగ్రహపడి

సంఖ్యాకాండము 3:32

యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధస్థలమును కాపాడు వారిమీద విచారణకర్త.

సంఖ్యాకాండము 20:25-28
25

నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండయెక్కి,

26

అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును.

27

యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండ నెక్కిరి.

28

మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండశిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగివచ్చిరి.

సంఖ్యాకాండము 27:2

వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద మోషే యెదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల యెదుటను సర్వసమాజము యెదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యములో మరణమాయెను.

సంఖ్యాకాండము 31:31

యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి.

సంఖ్యాకాండము 31:54

అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతులయొద్దనుండియు శతాధిపతులయొద్దనుండియు ఆ బంగారును తీసికొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి.

యెహొషువ 14:1

ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి.

యెహొషువ 24:33

మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతినొందినప్పుడు ఎఫ్రాయీమీయుల మన్యప్రదేశములో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్యబడిన ఫీనెహాసుగిరిలో జనులు అతని పాతిపెట్టిరి.

1దినవృత్తాంతములు 24:1-6
1

అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.

2

నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియాజరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి.

3

దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.

4

వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమ పితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతివారిలో ఎనిమిదిమంది తమ తమ పితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి.

5

ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి.

6

లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను.

ప్రధానయాజకుడైన
2 దినవృత్తాంతములు 19:11

మరియు ప్రధానయాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీమీద ఉన్నాడు, యూదా సంతతివారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జెబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలుచేయుటకై యెహోవా మీతో కూడ ఉండును.

2 దినవృత్తాంతములు 26:20

ప్రధానయాజకుడైన అజర్యాయును యాజకులందరును అతనివైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై యుండెను. గనుక వారు తడవుచేయక అక్కడనుండి అతనిని బయటికి వెళ్లగొట్టిరి; యెహోవా తన్ను మొత్తెనని యెరిగి బయటికి వెళ్లుటకు తానును త్వరపడెను.

హెబ్రీయులకు 5:4

మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును.