
బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి యెక్కువగా తిరుగుబాటు చేయుడి, ప్రతి ప్రాతఃకాలమున బలులు తెచ్చి మూడేసి దినముల కొకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి.
ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైతివి; అయినను యూదా ఆ పాపములో పాలుపొందక పోవునుగాక. గిల్గాలునకు పో వద్దు; బేతావెనునకు పో వద్దు; యెహోవా జీవముతోడని ప్రమాణము చేయవద్దు.
వారి చెడుతన మంతయు గిల్గాలులో కనబడుచున్నది; అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్ట క్రియలను బట్టి వారి నికను ప్రేమిం పక నా మందిరములోనుండి వారిని వెలివేతును; వారి యధిపతు లందరును తిరుగుబాటు చేయువారు.
నీ జనుల మీదికి అల్లరి వచ్చును; షల్మాను యుద్ధముచేసి బేతర్బేలును పాడుచేసినట్లు ప్రాకారములుగల నీ పట్టణము లన్నియు పాడగును; పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు.
ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును; ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును.
నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు, గిల్గాలులో జనులు ఎడ్లను బలులగా అర్పింతురు, వారి బలిపీఠములు దున్నినచేని గనిమల మీదనున్న రాళ్లకుప్పలవలె ఉన్నవి
షోమ్రోనుయొక్క దోషమునకు కారణమగుదాని తోడనియు, దానూ, నీ దేవుని జీవముతోడనియు, బెయేర్షెబా మార్గ జీవముతోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవ కుండ కూలుదురు.
అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థనచేసెను.
నేను మీ యున్నతస్థలములను పాడుచేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.
నా మనస్సు మీయందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసెదను; మీ పరిశుద్ధస్థలములను పాడుచేసెదను; మీ సువాసనగల వాటి సువాసనను ఆఘ్రాణింపను.
నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు.
కుమారులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్టబడుదురు.
ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైతివి; అయినను యూదా ఆ పాపములో పాలుపొందక పోవునుగాక. గిల్గాలునకు పో వద్దు; బేతావెనునకు పో వద్దు; యెహోవా జీవముతోడని ప్రమాణము చేయవద్దు.
ఇశ్రాయేలువారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును, ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును, పర్వతములను చూచిమమ్మును మరుగుచేయుడనియు, కొండలను చూచిమామీద పడుడనియు వారు చెప్పుదురు.
ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును; ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును.
అయితే ఇంకను ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగజేయును.ప్రహర్షముతో నీ పెదవులను నింపును.
అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును.
ఆలోచన చేసికొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు.
బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు.
జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోకజ్ఞానము కాదు, నిరర్థకులైపోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని
ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురుచేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రముమీద పనిచేసి జీవనముచేయు వారందరును దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి