ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొనివచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను.
నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును.
రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము.
నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా
యెహోవాను సేవింపవలెనని తమ మధ్యనుండి అన్యదేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను.
తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను.
వారి కాధారము లేకపోవును.
యెహోవా , తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము .
అయినను వారిరోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను .
వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకముచేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను .
దాని పెల్లగింతుననియు, విరుగగొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదోయొక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా
ఏ జనమునుగూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనముచేయుట మానినయెడల నేను వారికి చేయ నుద్దేశించిన కీడునుగూర్చి సంతాపపడుదును.
మరియు కట్టెదననియు, నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా
ఆ జనము నా మాట వినకుండ నా దృష్టికి కీడుచేసినయెడల దానికి చేయదలచిన మేలునుగూర్చి నేను సంతాపపడుదును.
ఎఫ్రాయిమూ , నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ? ఇశ్రాయేలూ , నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లు చేతును ? సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును ? నా మనస్సు మారినది , సహింపలేకుండ నా యంతరంగము మండుచున్నది .
ఈ నీనెవెవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.
కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను.
అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజుచేత బాధనొందిన ఇశ్రాయేలువారిని కనికరించి అతని మనవి నంగీకరించెను.
యెహోయాహాజు దినములన్నియు సిరియారాజైన హజాయేలు ఇశ్రాయేలువారిని బాధపెట్టెను.
గాని యెహోవా వారిమీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్న నిబంధననుబట్టి వారియందు లక్ష్యము నిలిపి, వారిని నాశము చేయనొల్లక యిప్పటికిని తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టక యుండెను.
బాధపడువారికి చేయబడిన బలాత్కారమునుబట్టియు దరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అనియెహోవా సెలవిచ్చుచున్నాడు.