మరియు కళేబరమునైనను చీల్చబడినదానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశియేమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును.
అతడు కళేబరమునైనను తిని దానివలన అపవిత్రపరచుకొనకూడదు; నేను యెహోవాను.
అందుకు అయ్యో , ప్రభువా , యెహోవా , నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే , బాల్యము నుండి నేటి వరకును చచ్చినదానినైనను మృగములు చీల్చినదానినైనను నేను తినినవాడను కానే , నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడ లేదే అని నేననగా
విగ్రహసంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.
మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను ఇది పస్కాపండుగను గూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదు గాని
వెండితో కొనబడిన దాసుడు సున్నతిపొందినవాడైతే దాని తినవచ్చును.
పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు.
మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు,
మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులైయుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.
ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్టిత జనము. మరియు యెహోవా భూమిమీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను.
అతడు గెలుచునుగాని తన స్వబలమువలన గెలువడు ; ఆశ్చర్యముగా శత్రువులను నాశనముచేయుటయందు అభివృద్ధి పొందుచు, ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను , అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును .
నారబట్టలు వేసికొని యేటి పైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని ; ఏమనగా, అతడు తన కుడిచేతిని ఎడమచేతిని ఆకాశము వైపు కెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టుపెట్టుకొని , ఒకకాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనముయొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగుననెను .
మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
నీ భూమి ప్రథమ ఫలములో మొదటివాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు.
నీ భూమియొక్క ప్రథమఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదనెను.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక , ఉత్తమమును , అనుకూలమును , సంపూర్ణమునై యున్న దేవుని చిత్త మేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.