జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,
విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాసస్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను.
ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టివేతును.
అపవిత్రుడు పాపశుద్ధిచేసికొనని యెడల అట్టి మనుష్యుడు సమాజములోనుండి కొట్టివేయబడును; వాడు యెహోవా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచెను; పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు; వాడు అపవిత్రుడు.
శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడుచేసియున్నారు నిత్యము పాడైయుండు చోట్లకు విజయము చేయుము.
దేవా , అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడియున్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచియున్నారు యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు .
నీ హేయదేవత లన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధస్థలమును అపవిత్ర పరచితివి గనుక కరుణా దృష్టియైనను జాలియైనను లేక నేను నిన్ను క్షీణింప జేసెదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను ; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు
వారిని చూడకుండ నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధిస్థానమును అపవిత్రపరచుదురు, దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచుదురు.
వారీలాగున నాయెడల జరిగించుచున్నారు ; అదియుగాక ఆ దినమందే , వారు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచిన దినమందే, నేను నియమించిన విశ్రాంతిదినములను సామాన్యదినములుగా ఎంచిరి.
తాము పెట్టుకొనిన విగ్రహములపేరట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధస్థలములో చొచ్చి దాని నపవిత్రపరచి , నామందిరము లోనే వారీలాగున చేసిరి .
దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు; దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరతురు.
భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటికాదు;
అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.
మరియు నా దేవుని మందిముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులు గాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.
నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా , ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము .
మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి . ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి .
మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.
ఆ మందిరమునుగూర్చిన విధి యేదనగా పర్వతము మీద దానికి చేరికైన స్థల మంతయు అతిపరిశుద్ధము , మందిరమునుగూర్చిన విధి యిదియే .